ఎన్టీఆర్ బయోపిక్ ఎందుకు చేస్తున్నానంటే...?

Update: 2018-07-17 06:20 GMT

ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో బాలయ్య - కృష్ కాంబినేషన్ లో వస్తున్న 'ఎన్టీఆర్' బయోపిక్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గా ఈ షూటింగ్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తుంది. ఆమె లేటెస్ట్ గా ఓ ఇంగ్లీష్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు ఎన్టీఆర్ బయోపిక్ లో ఎందుకు నటిస్తున్నారో వివరణ ఇచ్చింది.

పాత్ర నచ్చడంతోనే ఒప్పుకున్నా...

తనకు ఇప్పటికే ఎన్నో బియోపిక్స్ లో నటించాలని ఆఫర్స్ వచ్చినా అవి ఆమె రిజెక్ట్ చేసిందంట. అయితే తెలుగులో ఎన్టీఆర్ అంటే చాలా ఫేమస్ యాక్టర్. ఆయన భార్య గురించి చాలా తక్కువ మందికి తెలియడం తనకు ఆకట్టుకుందని చెప్పింది. ఎన్టీఆర్ లైఫ్ లో ఆయన భార్యది కీలకమైన పాత్ర. ఆ పాయింట్ నన్ను ఆకట్టుకోవడం...ఆ రోల్‌పై ఆసక్తి కలగడం.. ఆలా వెంటనే ఓకే చేయడం జరిగిందని వెల్లడించింది ఆమె. అయితే ఈ సినిమాలో విద్య బాలన్ కేవలం అతిథి పాత్రలో మాత్రమే నటిస్తుందనే విషయం మీడియాలో నడుస్తుంది.

బసవతారకం గురించి తెలుసుకుంటూ...

మరి ఎన్టీఆర్ భార్య పాత్ర ఆమె ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. అదిగాక సోమవారం నటి విద్యాబాలన్ ఎన్టీఆర్ ఫ్యామిలీని కలిసి... అసలు ఆమె మీతో ఎలా ఉండేవారు.. ఎలా మాట్లాడేవారు.. ఆలా ఆమె గురించి అన్ని తెలుసుకుందని ఫిలింనగర్ సమాచారం. ఇక విద్యాబాలన్ ఆఫిషియల్ గా ఈ బుధవారం నుంచి రెగ్యులర్ షూట్‌కి హాజరుకానుంది.

Similar News