ఎన్టీఆర్ సినిమా రెండు భాగాలపై క్లారిటీ

Update: 2018-06-28 10:10 GMT

నందమూరి బాలకృష్ణ - క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతోంది ఎన్టీఆర్ బయోపిక్. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు చకచకాగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా.. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించనున్నారు. ఎన్టీఆర్ చిన్నప్పటి నుండి తన రాజకీయ రంగప్రవేశం వరకు ప్రేక్షకులకి చూపించాలంటే నిడివి తక్కువగా ఉంటె సరిపోదని రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులకి చూపించాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. మొదటి పార్ట్ ను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసి రెండో పార్ట్ ను 2019 సమ్మర్ లో రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిసిపోయింది. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందడం లేదనేది ప్రాజెక్టు నిర్వాహకుల వైపు నుంచి వినిపిస్తోన్న మాట.

ఇక రెగ్యూలర్ షూటింగ్...

జులై 5వ తేదీ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని.. ముందుగా ప్రకటించినట్టే ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతున్నట్టు చిత్ర యూనిట్ స్పష్టం చేశారు. ఇక ఈ సినిమాలో కృష్ణ పాత్రలో మహేష్.. నాగేశ్వరరావు పాత్రలో నాగ చైతన్య నటిస్తున్నారని వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి.

Similar News