ఎట్టకేలకు ఎన్టీఆర్ బయోపిక్‌పై క్లారిటీ..!

Update: 2018-06-18 06:36 GMT

హమ్మయ్య ఎట్టకేలకు ఎన్టీఆర్ బయోపిక్ పై క్లారిటీ వచ్చింది. కొన్ని రోజులు కిందట ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు జరుపుకున్నా తర్వాత ఆ ప్రాజెక్ట్ నుండి డైరెక్టర్ తేజ తప్పుకోవడంతో...అసలు ఈ సినిమా షూటింగ్ జరుగుతుందా..లేదా అన్న అనుమానాలు అందరిలో వచ్చాయి. కొందరేమో ఈ ఫిల్మ్ రావడం కష్టమని, మరికొందరేమో ఎన్నికల సమయంలో వచ్చే అవకాశం ఉందని ఇలా రకరకాలుగా చెప్పుకున్నారు.

ప్రమాణ స్వీకారం చేసిన రోజే

ఈ నేపథ్యంలో సినిమాపై పూర్తి క్లారిటీ వచ్చింది. చిత్ర యూనిట్ దీనిపై క్లారిటీ ఇస్తూ.. వచ్చేఏడాది జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు తెలిపారు. జనవరి 9న సీనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సో అదే రోజు ఎన్టీఆర్ బయోపిక్ ని రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

సంక్రాంతి సెంటిమెంట్ కలిసొస్తుందా...

మరోపక్క సంక్రాంతి అంటే బాలయ్యకు సెంటిమెంట్. సో ఎట్టి పరిస్థితిల్లో ఈ సినిమాను సంక్రాంతి రేస్ లో ఉంచాలని చూస్తున్నాడు బాలయ్య. బాలయ్యకు సంక్రాంతి బరిలో మంచి ట్రాక్ రికార్డు ఉండటంతో.. ఈ సినిమాతో మరో హిట్‌ను సాధిస్తాడంటున్నారు అభిమానులు. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా త్వరగా ఫినిష్ చేస్తున్నాడంట. గతంలో క్రిష్..బాలయ్యతో 'గౌతమీపుత్ర శాతకర్ణి' మూవీ చేసిన విషయం తెల్సిందే. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది.

Similar News