వీరి పాత్రలు కూడా ఎన్టీఆర్ లో చూపించనున్నారు..!

Update: 2018-10-23 06:55 GMT

క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఎక్కడ కంప్రమైజ్ కావడం లేదు. ఎన్టీఆర్ జీవితంలో చిన్న చిన్న పాత్రలు కూడా ఇందులో చూపించనున్నాడు. ఎన్టీఆర్ జాత‌కాలను బాగా నమ్మేవారు. ఏదైనా పని చేయాలంటే ముహుర్తాలు చూశేవారు. ఆయనకు భూతాల రాజు అనే ఓ వ్య‌క్తిగ‌త జ్యోతిష్యుడు ఉండేవారు. ఎన్టీఆర్ చేసే ముఖ్యమైన పనులు అన్నింటికీ ఆయనే ముహూర్తం పెట్టేవారు. అయితే ఇతని పాత్ర కూడా బయోపిక్ లో చూపించనున్నారు క్రిష్. అలానే ఎన్టీఆర్ కు వీర అభిమాని అయిన కుంటి సాయి పాత్ర కూడా ఇందులో ఉంది అంట.

రెండో భాగంలో సాయి కథ...

ఎన్టీఆర్ సీఎం అయినప్పుడు కుంటి సాయికి కూడా ఓ ప‌ద‌వి ల‌భించింది. ఎన్టీఆర్ చాలాసార్లు అభిమానులే నా దేవుళ్ళు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అందుకేనేమో కుంటి సాయికి ఓ పదవి ఇచ్చారు ఎన్టీఆర్. అసలు ఈ కుంటి సాయి ఎవరు..? ఎన్టీఆర్ కు అభిమాని ఎలా అయ్యారు..? పదవి ఎలా వచ్చింది..? అనేది ఆస‌క్తిక‌ర‌మైన ఎపిసోడ్‌. కుంటి సాయి ఎపిసోడ్ మొత్తం పార్ట్ 2 లో రానుంది. ఈ బయోపిక్ రెండు భాగాలుగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

Similar News