ఇతనే ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు

Update: 2018-05-02 09:02 GMT

బాలకృష్ణ ఎంతో ఇంట్రెస్ట్ తో తన తండ్రి బయో పిక్ ని వెండితెరమీద ఆవిష్కరించాలని డిసైడ్ అయ్యాడు. అలా డిసైడ్ అవడమే ఆ సినిమా కి డైరెక్టర్ గా రామ్ గోపాల్ వర్మ పేరుని పూరి సూసించాడు బాలకృష్ణ కి. కానీ బాలయ్య మాత్రం నేనే రాజు నేనే మంత్రి తో హిట్ అందుకున్న తేజ కి అవకాశం ఇచ్చాడు. అయితే వర్మ మాత్రం బాలయ్య మీద పంతానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ హడావిడి చేసాడు. తర్వాత కామ్ అయ్యాడు. ఇక తేజ డైరెక్టర్ గా ఎన్టీఆర్ పేరుతొ ఎన్టీఆర్ బయో పిక్ ని బాలయ్య అధికారికంగా సెట్స్ మీదకి తీసుకెళ్లిపోయారు. కానీ తేజ బాలయ్యకి నేను ఈ సినిమా చెయ్యనని షాక్ ఇచ్చాడు. అయితే బాలకృష్ణ. తేజ అలా వెళ్లిపోవడంతో.. రాఘవేంద్ర రావు ని, క్రిష్ ని కూడా ఎన్టీఆర్ బయో పిక్ ని డైరెక్ట్ చెయ్యమని అడిగినట్లుగా వార్తలొచ్చాయి.

కానీ వారిద్దరూ ఎన్టీఆర్ బయో పిక్ ని తెరకెక్కించే సాహసం చేయలేనని చెప్పారో... లేదంటే ప్రస్తుతం ఖాళీ లేదని చెప్పారో తెలియదు గాని... ప్రస్తుతానికి ఏ దర్శకుడిని బతిమిలాడి ఈ ఎన్టీఆర్ బయో పిక్ ని వారి చేతిలో పెట్టేది లేదనే టైప్ లో బాలకృష్ణ ఎన్టీఆర్ బయో పిక్ దర్శకత్వ బాధ్యతలను నెత్తినేసుకున్నాడు. మరి డైరెక్టర్ గా అనుభవం లేని బాలకృష్ణ ఈ సినిమాని డైరెక్ట్ చెయ్యడం అంటే సాహసమనే చెప్పాలి. అందుకే బాలయ్య తన డైరెక్షన్ లో.. తానె హీరోగా చేస్తూ ఈ సినిమాకి దర్శకత్వ విభాగములో లో బాగా అనుభవమున్న ఒక దర్శకుడిని పర్యవేక్షకుడిగా తీసుకొస్తున్నాడట.

మరి ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. ఆ నలుగురు సినిమాతో మన సంబంధాలకు, రక్త సంబంధానికి గల విలువలను తెలియజెప్పిన దర్శకుడు చంద్ర సిద్దార్ధ్. చంద్ర సిద్దార్ధ్ దర్శకత్వ పర్యవేక్షణలో బాలకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయో పిక్ అతి త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతున్నాడనే టాక్ బయటికి వచ్చింది. మరి ఎన్టీఆర్ బయో పిక్ దర్శకత్వ పర్యవేక్షణకు చంద్ర సిద్దార్ధ్ ని తీసుకుంటున్నారనే విషయం మాత్రం పక్కా..అని త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందంటున్నారు.

Similar News