క్రిష్ జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టం

ఈ సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అవుతున్న అందరి చూపు ‘ఎన్టీఆర్ కథానాయకుడి’ మీదే ఉంది. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈచిత్రం కోసం రెండు [more]

Update: 2018-12-27 03:29 GMT

ఈ సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అవుతున్న అందరి చూపు ‘ఎన్టీఆర్ కథానాయకుడి’ మీదే ఉంది. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈచిత్రం కోసం రెండు రాష్ట్రాల ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆయన జీవితం గురించి తెలుసుకోవాలి అని చాలామంది చూస్తున్నారు. ఇప్పుడున్న యూత్ కూడా ఆయన జీవితం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు. మరి ఆయన జీవితాన్ని ఎంత లోతుగా చూపించి ఉంటారు అనేదాని మీద అనుమానాలు కూడా ఉన్నాయి.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఇందులో 12 రీమిక్సు పాటలు 63 గెటప్పులతో ఎన్టీఆర్ పాత సినిమాలలోని బిట్లు అన్ని కలిపితే ఎంత లేదన్నా గంటన్నర పైగా ఉంటుందని టాక్. మరి మిగిలిన గంటలో ఏమి చూపించారనేది చూడాలి. కథ తక్కువ గా ఉండి గెటప్పులు ఎక్కువగా ఉంటె ప్రేక్షకులు ఈ సినిమా ను అంగీకరించరు. కేవలం రీమిక్సులతో నెట్టేస్తే సరిపోదు. ఆలా చూపించాల్సివస్తే యుట్యూబ్ లో చాలానే ఉంటాయి.

మరి క్రిష్ ఎంటువంటి జాగ్రత్తలు తీసుకున్నాడో చూడాలి. కేవలం గెటప్స్ తో..రెండు మూడు సాంగ్స్ తో చూపిస్తే ప్రేక్షకులు మొహమాటం లేకుండా సినిమాను తిరస్కరిస్తున్నారు. అంతేకాదు కథానాయకుడి సినిమా చివరిలో మహానాయకుడు గురించి లీడ్ వెయ్యాలి లేకపోతే మహానాయకుడిని చూసే అవకాశాలు తక్కువ. మరి క్రిష్ ఏం చేస్తాడో చూడాలి. బయోపిక్ అంటే ప్రేక్షకులు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి అప్పుడే హిట్ అవుతుంది. ‘మహానటి’ విషయంలో అదే జరిగింది. అందుకే ఈసినిమా హిట్ అయింది.

Tags:    

Similar News