రెండిటీలో ఏది హైలెట్ అంటారు

ఈ న్యూ ఇయర్ కి టాలీవుడ్ లో చిన్న పెద్ద సినిమాల పోస్టర్స్ మీడియాలో తెగ హడావిడి చేశాయి. 31 నైట్ నుండే తమ తమ సినిమాల్తో [more]

Update: 2019-01-02 03:39 GMT

ఈ న్యూ ఇయర్ కి టాలీవుడ్ లో చిన్న పెద్ద సినిమాల పోస్టర్స్ మీడియాలో తెగ హడావిడి చేశాయి. 31 నైట్ నుండే తమ తమ సినిమాల్తో న్యూ ఇయర్ కి స్వాగతం పలుకుతూ.. న్యూ ఇయర్ కి విషెస్ చెబుతూ పోస్టర్స్ విడుదల చేశారు. అయితే అన్నిటిలో ఏక్కువగా ఈ సంక్రాతి బరిలో పోటా పోటీగా బరిలోకి దిగుతున్న ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, రామ్ చరణ్ వినయ విధేయరామ సినిమాల పోస్టర్స్ అందరిని ఆకట్టుకునేలా కనబడ్డాయి. సంక్రాతి బరిలో భారీ క్రేజున్న చిత్రాలుగా మొదటి నుండి న్యూస్ లో ఉంటున్న ఈ రెండు చిత్రాలు న్యూ ఇయర్ పోస్టర్స్ లోను పోటీ పడ్డాయి. ప్రమోషన్స్ కూడా నువ్వా నేనా అన్నట్టుగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయితే.. వినయ విధేయరామ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కేటీఆర్, చిరు లు గెస్ట్ లుగా విచ్చేసారు. ఇక మాస్ మూవీ గా బోయపాటి – రామ్ చరణ్ ల వినయ విధేయరామ కి మొదటినుండి భారీ అంచనాలుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల ఆరాధ్య దైవం, నట కిరీటి నందమూరి తారక రామారావు బయోపిక్ గా కథానాయకుడికి క్రేజుంది.

మరి కథానాయకుడితో ఎన్టీఆర్ భార్య బసవతారకం కేరెక్టర్ లో నటిస్తున్న విద్య పుట్టిన రోజు న్యూ ఇయర్ డే ఒకే రోజు కావడంతో.. ఎన్టీఆర్ బయోపిక్ టీం విద్య పుట్టిన రోజుకనుకగా కథానాయకుడు పోస్టర్ విడుదల చేసింది. అలాగే బాలకృష్ణ, విద్య ల కాంబో పిక్ అంటే ఫామిలీస్ ఆకట్టుకునేలా మరో పోస్టర్ ని న్యూ ఇయర్ విషెస్ తో విడుదల చేసింది. ఇక వినయ విధేయరామ 31 న రామ్ చరణ్ అన్న, వదినలతో కలిసున్న ఫ్యామిలీ పిక్ అంటే వినయ విధేయరామ ఫ్యామిలీ పోస్టర్ తో పడెయ్యగా… న్యూ ఇయర్ రోజున హీరోయిన్ కియారా తో కలిసి రామ్ చరణ్ ట్రెడిషనల్ లుక్ ని వదిలింది. ఇక వినయ విధేయరామ న్యూ ఇయర్ పోస్టర్ మాత్రం రొమాంటిక్ గా అందంగా ఫ్యామిలీస్ కి ఎక్కేసింది. మరి సంక్రాంతికి నువ్వా నేనా అన్నట్టుగా ఉన్న ఈ రెండు చిత్రాలు ఇలా ప్రమోషన్స్ విషయంలోనూ బరిగానే పోటీ పడుతున్నాయి. మరి నిన్న న్యూ ఇయర్ పోస్టర్స్ లో రెండు సినిమాల్లో ఏది హైలెట్ గా నిలిచిందో అనేది మీరే చెప్పాలి. ఇక రెండు సినిమాల అంటే బాలయ్య అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు అంటే నందమూరి, మెగా అభిమానులు మాత్రం తమ అభిమాన హీరోల లుక్స్ తో సంతృప్తి చెందారు.

Tags:    

Similar News