ఎన్టీఆర్ ప్లాపుతో… క్రిష్ పై విరుచుకు పడ్డ హీరోయిన్

ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు ఎలాంటి ప్లాప్స్ అనేది ఆయా సినిమాల కలెక్షన్స్ చూస్తేనే తెలుస్తుంది. దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ కి శక్తి వంచన లేకుండా [more]

Update: 2019-02-26 03:28 GMT

ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు ఎలాంటి ప్లాప్స్ అనేది ఆయా సినిమాల కలెక్షన్స్ చూస్తేనే తెలుస్తుంది. దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ కి శక్తి వంచన లేకుండా పనిచేశాడు. బాలయ్య కూడా విరామమే లేకుండా ఎన్టీఆర్ బయోపిక్ ని పూర్తి చేసాడు. కానీ ఫలితం అనుకున్నట్టుగా రాలేదు. పాపం క్రిష్.. అటు బాలీవుడ్ మణికర్ణిక విషయంలోనూ, ఇటు ఎన్టీఆర్ బయోపిక్ విషయంలోనూ బాగా నలిగిపోయాడు. మణికర్ణిక విషయంలో కంగనాతో విభేదాలు, ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ప్లాప్ మూవీస్ తీశానని గిల్టీ ఫీలింగ్ తో క్రిష్ పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా వుంది. ఇక కథానాయకుడు సినిమా తర్వాత మణికర్ణిక విషయంలో కంగనాతో విభేదించిన క్రిష్ ఆ తర్వాత సైలెంట్ అయ్యాడు. కాకపోతే అనాల్సినవన్నీ అనేశాడు.

కంగనా దర్శకత్వం క్రెడిట్ ఎలా తీసుకుంటుందన్నాడు.ఇక కంగనా లేట్ గా స్పందించినా క్రిష్ తో మీడియా ముఖంగా ఒక ఆటాడుకుంది. కానీ క్రిష్ మాత్రం మహానాయకుడు షూటింగ్ తో బిజీ అవడంతో కంగానకి కౌంటర్ ఇవ్వలేదు. ఇక మణికర్ణిక సినిమా సూపర్ అన్నప్పటికీ. బయ్యర్లు కొద్దిపాటి లాస్ అవడంతో.. క్రిష్ వలన తన సినిమాని ఎవరూ చూడలేదని… బాలీవుడ్ మీద కూడా దుమ్మెత్తిపోసింది కంగనా. ఇక ప్రస్తుతం కథానాయకుడు, మహానాయకుడు భారీ డిజాస్టర్స్ అవడంతో.. కంగనా క్రిష్ మీద మరోమారు విరుచుకుపడింది. కాదు కాదు క్రిష్ ని రెవెట్టేసి… బాలకృష్ణ కి సానుభూతిని తెలియజేసింది. –

ఆయన డైరెక్షన్ లో సినిమా వస్తే ఇలానే ఉంటుంది… కథానాయకుడు, మహానాయకుడు కలెక్షన్స్ రిపోర్ట్ చూస్తే అర్ధం అయ్యింది.. క్రిష్ ని నమ్మితే ఎలా ఉంటుందో అర్ధమయ్యిందా అంటూ… పాపం బాలకృష్ణ సార్ అనేసింది. చాలా కష్టమైనా పరిస్థితుల్లో నేను మణికర్ణిక ప్రాజెక్టును స్వీకరించినపుడు అందరూ నన్ను శంకించారు. అంతేకాకుండా నేనేదో నేరం చేసినట్టుగా…. నేను హింసించి.. క్రిష్‌ను మోసం చేసినట్లు నాపై నిందలు వేసి పీక్కుతిన్నారు. మరిప్పుడేమంటారు.. అంటూ వ్యంగంగా మాట్లాడడమే కాదు… క్రిష్‌తో పాటు కొన్ని మీడియా వర్గాలు కూడా మణికర్ణిక పై విషం చిమ్మాయి.. అంటూ విరుచుకుపడింది కంగనా.

Tags:    

Similar News