ఎన్టీఆర్ లో జయప్రద పాత్రలో బ్యూటీ...!!

Update: 2018-10-20 09:04 GMT

ఎన్టీఆర్ బయోపిక్..ఈచిత్రం నుండి రోజుకొక అప్ డేట్..రోజుకొక విశేషం. క్రిష్ దర్శకత్వంలో బాలయ్య మెయిన్ లీడ్ లో వస్తున్నా ఈచిత్రంపై అంచనాలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఇండియా మొత్తం గర్వించ తగిన నటుడు ఎన్టీఆర్. అతని జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో ఎన్టీఆర్ గా బాలయ్య కనిపించనున్నారు. ఎన్టీఆర్ భార్య పాత్రలో అంటే బసవతారకం పాత్రలో బాలీవుడ్ ప్రముఖ నటి విద్య బాలన్ నటిస్తుంది.

రెండు భాగాలుగా...

రెండు భాగాలుగా వస్తున్న ఈచిత్రం మొదటి భాగం 'కథానాయకుడు'కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తూ వెళుతున్నారు. ఈనేపధ్యంలో అక్కినేని నాగేశ్వరరావు గా సుమంత్...శ్రీదేవి గా రకుల్ కనిపించనున్నారు. వీరి లుక్స్ కూడా రీసెంట్ గా రిలీజ్ అయ్యా.యి. ఇక జయప్రద పాత్రకోసం ఇటీవలే తమన్నాను ఎంపిక చేసుకున్నారు. రీసెంట్ గా ఆమె షూటింగ్ లో జాయిన్ అయిందని తెలుస్తుంది.

తమన్నాకు చోటు......

ఎన్టీఆర్ తో జయప్రద 'అడవిరాముడు' .. 'సూపర్ మేన్' .. 'యమగోల' వంటి చిత్రాల్లో నటించింది. ఈసినిమాలకి సంబంధించి ఎన్టీఆర్ బయోపిక్ లో ఒకటి రెండు సన్నివేశాలకు .. ఒక సూపర్ హిట్ సాంగ్ కు చోటుదక్కినట్టు చెబుతున్నారు. మరి తమన్నా బాలయ్య పక్కన ఏ సాంగ్ కి స్టెప్స్ వేసిందో తెలియాలంటే సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఎన్టీఆర్ 'కథానాయకుడు' కోసం వెయిట్ చేయాల్సిందే.

Similar News