ఎన్టీఆర్ బయోపిక్ బడ్జెట్ ఇదే..?

Update: 2018-07-12 06:46 GMT

సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం టాలీవుడ్ లో మరిన్ని బయోపిక్ లకు స్ఫూర్తిగా నిలిచింది. ఇక నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరణ కూడా ప్రారంభమైంది. దర్శకుడిగా క్రిష్ ఫైనల్ అయ్యాక చిత్ర నిర్మాణం వేగం పెరిగింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ, బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక చంద్రబాబు నాయుడు పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నా ఇంకా స్పష్టత రాలేదు.

బాలయ్య కెరీర్ లోనే భారీ బడ్జెట్

అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త జోరుగా ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రానికి బాలకృష్ణ రూ.50 కోట్లు బడ్జెట్ పెట్టాలని నిర్ణయించుకున్నాడట. అంటే ఒకవేళ ఇదే నిజమైతే బాలకృష్ణ కెరీర్ లో ఇదే భారీ బడ్జెట్ సినిమా అవుతుంది. ఈ వారమే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమాను 2018 సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనతో ఉన్నారట. తెలుగుతో పాటు హిందీ, తమిల్ లోనూ విడుదల చేయాలని భావిస్తున్నారు.

Similar News