ఎన్టీఆర్ కి అందరిని సెట్ చేస్తున్నారు!

Update: 2018-06-26 10:19 GMT

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ అతి త్వరలోనే పట్టాలెక్కబోతుంది. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరో, నిర్మాతగా.. ఎన్టీఆర్ బయో పిక్ రూపు దిద్దుకోబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న క్రిష్ మరో పక్క ఎన్టీఆర్ బయోపిక్ లో నటించబోయే నటీనటుల ఎంపిక చేపట్టాడు. ఈ సినిమాని దర్శకుడు క్రిష్ రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నాడనే ప్రచారం కూడా ఉంది. రాజకీయ జీవితాన్ని ఒక భాగంగా, నట జీవితాన్ని మరో భాగంగానే క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నట్టుగా ఫిలింనగర్ టాక్.

చంద్రబాబు పాత్ర కోసం రానా..?

ఇక ఎన్టీఆర్ బయోపిక్ నటీనటులతో.. ఇప్పటికే ఎన్టీఆర్ భార్య బసవతారకం క్యారెక్టర్ కోసం బాలీవుడ్ నటి విద్య బాలన్ ని ఎంపిక చేసిన క్రిష్ చంద్రబాబు క్యారెక్టర్ కోసం బాహుబలి భల్లాల దేవుడు రానా ని తీసుకోబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. మరి నిజంగానే రానా చంద్రబాబు క్యారెక్టర్ అంటే ... మాములు విషయం కాదు. కానీ అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇక తాజాగా ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ నటుడు సచిన్ కెడెకర్ ని క్రిష్ ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ జీవితంలో నాదెండ్ల భాస్కర్ రావు డి కీలకపాత్ర.

ఏఎన్నార్ పాత్రలో మనవడు...

సచిన్ కెడెకర్ ని నాదెళ్ల భాస్కర్ రావు పాత్రకి ఎంపిక చేశారట. ఇక ఎన్టీఆర్ నట జీవితంలో అతి ముఖ్యమైన ఏఎన్నార్ పాత్ర కోసం నాగ చైతన్య ని దర్శకుడు క్రిష్ సంప్రదించాడనే టాక్ ఉంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే మొదలు పెట్టుకుని.. వచ్చే సంక్రాతి బరిలో నిలవనుందనేది తాజా సమాచారం.

Similar News