క్రిష్ ని తొక్కేసాడా?

మరో రెండు రోజుల్లో ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అవ్వబోతుంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఈసినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈసినిమా [more]

Update: 2019-01-07 07:51 GMT

మరో రెండు రోజుల్లో ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అవ్వబోతుంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఈసినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈసినిమా లో బాలయ్య ఎన్టీఆర్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులు నుండి బాలయ్య సినిమాను డైరెక్ట్ చేసాడని వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా జరిగిన టీం ఇంటర్వ్యూ లో బాలయ్య దీనిపై క్లారిటీ ఇచ్చాడు.

సుమంత్..క్రిష్..రానా లతో పాటు బాలయ్య ఉన్న ఈ ఇంటర్వ్యూ లో బాలయ్య మాట్లాడుతూ…అవును ఎన్టీఆర్ బయోపిక్ లో కొన్ని సీన్స్ తానే డైరక్ట్ చేశానని చెప్పుకొచ్చాడు. తన తండ్రి జీవితం లో జరిగిన కొన్ని ఘటనలు క్రిష్ కు అస్సలు తెలియవని…అందులో రెండు మూడు సీన్స్ తనే డైరెక్ట్ చేసానని చెప్పాడు.

బాలయ్య ఈ విషయం చెబుతున్నప్పుడు పక్కనే క్రిష్ ఉండి తల కూడా ఊపాడు. బాలకృష్ణ ఈ విషయం చెబుతున్నప్పుడు పక్కనే ఉన్న సుమంత్ అండ్ రానా కూడా నిర్థారించారు. అక్కినేని నాగేశ్వరరావు గెట్ అప్ వేసి సుమంత్…బాలయ్య సలహాల మేరకే తను నటించానని చెప్పుకొచ్చాడు. అలానే రానా కూడా బాలయ్య సూచనలు బాగా ఉపయోగపడ్డాయి అని చెప్పాడు.

Tags:    

Similar News