ఎన్టీఆర్ హావా మళ్లీ స్టార్ట్!!

ఎన్టీఆర్ ఎండితెర మీద తిరుగులేని స్టార్. అది ఎవరూ కాదనలేని సత్యం. అయితే ఎన్టీఆర్ బుల్లితెర మీద కూడా తిరుగులేని స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. స్టార్ మా [more]

Update: 2020-04-13 07:50 GMT

ఎన్టీఆర్ ఎండితెర మీద తిరుగులేని స్టార్. అది ఎవరూ కాదనలేని సత్యం. అయితే ఎన్టీఆర్ బుల్లితెర మీద కూడా తిరుగులేని స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. స్టార్ మా లో ఏంటో ప్రతిష్టాత్మకంగా ప్రసారం అయినా బిగ్ బాస్ సీజన్ వన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా ఇరగదీసాడు. బిగ్ బాస్ సీజన్ వన్ సాలిడ్ గా అదిరిపోయే రేటింగ్ తో ఇరగదీసింది. ఎన్టీఆర్ బుల్లితెరమీద భీభత్సమైన క్రేజ్ సంపాదించాడు. అయితే ప్రస్తుతం కరోనా లక్డౌన్ తో షూటింగ్స్ నిలిచి పోవడంతో.. ఛానల్స్ లో ప్రచారం కాబోయే సీరియల్స్, స్పెషల్ షోస్, రియాలిటీ షోస్ నిలిచిపోవడంతో.. అన్ని ఛానల్స్ వారు గతంలో తమ ఛానల్ లో సూపర్ హిట్ అయిన షోస్ ని పాత షోస్ ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాయి. అందులో భాగంగానే స్టార్ మా వారు నాగ్ హోస్టింగ్ చేసిన బిగ్ బాస్ సీజన్ 3 ని రోజు సాయంత్రం మూడు గంటలకు ప్రసారం చేస్తున్నారు మా టివి వారు.

అయితే తాజాగా ఎన్టీఆర్ హోస్టింగ్ లో తెరకెక్కిన బిగ్ బాస్ సీజన్ వన్ ని కూడా స్టార్ మా మళ్లీ పునః ప్రసారం చేస్తుంది. మరి సీజన్ వన్ లో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా హౌస్ మేట్స్ హడావిడి, సందడి తో బిగ్ హిట్ అయిన షో మళ్ళీ బుల్లితెర మీద కనబడుతుంది. అదీనూ… ఎన్టీఆర్ మళ్లీ బుల్లితెర మీద సందడి అంటే ఊరుకుంటారా జనాలు. అసలే కొత్త షోస్, సీరియల్స్ లేక విసిగిపోయిన ప్రేక్షకులు.. ఇళ్లకే పరిమితమై బోర్ కొట్టి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ మళ్లీ బుల్లితెర మీద కనబడితే ఆ షోని మళ్ళీ హిట్ చేసి పడెయ్యరు.? ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులు ట్విట్టర్ వేదికగా తెగ హంగామా మొదలెట్టేసారు. #NtrsBigBossReTelecast అనే హాష్ టాగ్ తో నానా రచ్చ చేస్తున్నారు.

Tags:    

Similar News