ఆ డైరెక్టర్ ని ఎన్టీఆర్ ని కలిపిన రైటర్?

ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలని తెలుగు డైరెక్టర్స్ మాత్రమే కాదు, తమిళ, కన్నడ డైరెక్టర్స్ కూడా తహతహలాడుతున్నారు. RRR సినిమా షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్ తన [more]

Update: 2020-04-17 02:14 GMT

ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలని తెలుగు డైరెక్టర్స్ మాత్రమే కాదు, తమిళ, కన్నడ డైరెక్టర్స్ కూడా తహతహలాడుతున్నారు. RRR సినిమా షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చెయ్యబోతున్నాడు. ఆ తర్వాత సిఎంమా ఎన్టీఆర్ ఎవరితో చెయ్యబోతున్నాడో అనే దానిమీద అందరిలో పిచ్చ క్యూరియాసిటీ. కరోనా లాక్ డౌన్ టైం లో ఎన్టీఆర్ కథలు వింటున్నాడనే టాక్ ప్రచారంలోకొచ్చింది. ఇక తమిళనాట అట్లీ ఎన్టీఆర్ తో సినిమా కోసం కాచుకుని కూర్చున్నాడు. మరోపక్క కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ ఓకె అంటే సై అనేలా ఉన్నాడు.

అయితే తమిళ డైరెక్టర్ అట్లీ ని ఎన్టీఆర్ తో కథ వినిపించేందుకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఒకరు హెల్ప్ చేసాడనే టాక్ వినబడుతుంది. ఎన్టీఆర్ ని అట్లీ కుమార్ ని కూర్చీబెట్టి కథ చర్చలు చేపట్టాడట. ఆయనెవరో కాదు బాహుబలి కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ మీడియేటర్ గా వ్యవహరించి అట్లీ కి ఎన్టీఆర్ కి మధ్యన ప్యాచప్ చేసాడట. అట్లీ తో విజయేంద్ర ప్రసాద్ కి మెర్సెల్ దగ్గరనుండి అనుబంధం ఉండడంతో.. మెర్సెల్ టైం లోనే ఓ కథ ని విజయేంద్ర ప్రసాద్ కి వినిపించగా.. ఈ కథ ఎన్టీఆర్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అని ఎన్టీఆర్ దగ్గరికి అట్లీ ని తీసుకెళ్లి కథ వినిపించాడని టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది.

Tags:    

Similar News