మన్యం ముద్దు బిడ్డ.. కొమరం భీం.. !!

గత ఐదు రోజులుగా RRR ఎన్టీఆర్ కొమరం భీం వీడియోపై అందరిలో ఆసక్తి, క్రేజ్, హైప్ పెంచుతూ వస్తుంది RRR టీం. ఇక నిన్న బుధవారం అయితే [more]

Update: 2020-10-23 04:12 GMT

గత ఐదు రోజులుగా RRR ఎన్టీఆర్ కొమరం భీం వీడియోపై అందరిలో ఆసక్తి, క్రేజ్, హైప్ పెంచుతూ వస్తుంది RRR టీం. ఇక నిన్న బుధవారం అయితే RRR హీరోలు ఎన్టీఆర్ – రామ్ చరణ్ మధ్యన ట్విట్టర్ సంభాషణ ఫాన్స్ కి పిచ్చెక్కించేస్తోంది. నిన్న 11 గంటలు ఎప్పుడు అవుతుందా? ఎప్పుడు భీం బయటికి వస్తాడా అని ఎదురు చూసారు. అప్పుడు కూడా చరణ్ వెయిటింగ్ రాజమౌళి గారు అని ఓ ఫన్నీ వీడియో పెడితే.. ఓ 30 మినిట్స్ ప్లీజ్ అంటూ రాజమౌళి రిప్లై ఇవ్వడం.. ఈలోపు ఎన్టీఆర్ హహహ అంటూ ఓ ఫన్నీ బ్రహ్మి వీడియో ని షేర్ చెయ్యడం.. ట్విట్టర్ లో ఇలా వెయిటింగ్ రామరాజు ఫర్ భీం అంటూ రాజమౌళి అందరిని వెయిట్ చేయించేసాడు. ఇక ఎన్నో నెలల నిరీక్షణకు జక్కన్న తాజాగా తెర దించాడు.

కొమరం భీం ఎన్టీఆర్ బయటికి వచ్చాడు. నీటి బిందువులను చీల్చుకుంటూ దట్టమైన అరణ్యం మధ్యన అన్న అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో కొమరం భీం నీటిని చీల్చుకుంటూ దట్టమైన అడవుల మధ్యన అదిరిపోయే కండలు చూపిస్తూ.. చేస్తున్న వ్యాయమ RRR కే హైలెట్ అనేలా ఉంది. అల్లూరి తన తమ్ముడు భీం ని పరిచయం చేస్తూ.. వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి..నిలబడితే సామ్రాజ్యాలు సాగిల పడతాయ్..వాడి పొగరు ఎగిరే జెండా..వాడి ధైర్యం చీకట్లని చీల్చే మండుటెండ. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దు బిడ్డ. నా తమ్ముడు కొండ్రు బెబ్బులి కొమరం భీం అంటూ ఎన్టీఆర్ పవర్ ఫుల్ కేరెక్టర్ భీం ని పరిచయం చేసాడు చరణ్. 

నిజంగా ఎన్టీఆర్ మేకోవర్ కి ఫాన్స్ కి పూనకాలే. బల్లెం విసిరితే అగ్ని కూడా చెల్లచెదురు అవడం హైలెట్ అనేలా ఉంది. జక్కన్న ఎన్టీఆర్ ని ఎలా చూపిస్తాడో అనే క్యూరియాసిటీని క్షణాల్లో మాయం చేసేసాడు జక్కన్న. ఎన్టీఆర్ ఉగ్ర రూపానికి మన్యం ప్రజలే కాదు…. యావత్ ఇండియా సలాం కొట్టాల్సిందే. 

Tags:    

Similar News