నందమూరి అభిమానులకు ఝలక్ ఇచ్చిన ఎన్టీఆర్?

కథానాయకుడు సినిమా విడుదలైనప్పుడు ఎలాంటి టాపిక్ మీడియాలో, ఫిలింసర్కిల్స్ లో నడిచిందో… ఇప్పుడు మహానాయకుడు సినిమా విడుదలయ్యాక కూడా అదే టాపిక్ రేజ్ అయ్యింది. అదేమిటంటే… గత [more]

Update: 2019-02-23 05:03 GMT

కథానాయకుడు సినిమా విడుదలైనప్పుడు ఎలాంటి టాపిక్ మీడియాలో, ఫిలింసర్కిల్స్ లో నడిచిందో… ఇప్పుడు మహానాయకుడు సినిమా విడుదలయ్యాక కూడా అదే టాపిక్ రేజ్ అయ్యింది. అదేమిటంటే… గత ఏడాది కాస్త కలిసినట్టుగా అనిపించిన.. తారక్ అండ్ బాలయ్యలు.. మళ్ళీ ఎన్టీఆర్ బయోపిక్ విడుదల సమయానికి అంటీముట్టనట్లుగానే కనబడుతుంది వ్యవహారం. ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిధిగా మెరిసిన జూనియర్ ఎన్టీఆర్.. కథానాయకుడు ప్రీమియర్ కి రాలేదు. అంతేనా కథానాయకుడు విడుదలయ్యాక కనీసం తాతగారి బయోపిక్ మీద ఒక ట్వీట్ కూడా వెయ్యలేదు.

ఇక తాజాగా మహానాయకుడు సినిమా ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ రాలేదు. అక్కడ కళ్యాణ్ రామ్ సందడి కనబడింది అలాగే.. నందమూరి ఫ్యామిలిలో 75 శాతం మంది ఆ ప్రియమిర్ కి విచ్చేసారు. కానీ తారక్ కనబడలేదు లేదు. ఇక తారక్ నిన్నటినుండి #RRR సెకండ్ షెడ్యూల్ లో జాయిన్ అయ్యాడు. రాజమౌళి తెరకెక్కిస్తున్న #RRR సెకండ్ షెడ్యూల్ లో తాజాగా జాయిన్ అయిన తారక్ ని అందరూ… తాతగారి బయోపిక్ కన్నా #RRR ఎక్కువైందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మహానాయకుడు నిన్న శుక్రవారం విడుదలైంది… కానీ తారక్ స్పందన మాత్రం లేదు.

మరి సినిమా విడుదలయ్యాక నందమూరి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ స్పందన కోసమే చూసారు. కానీ తారక్ మాత్రం ఒక్క ట్వీట్ కూడా వెయ్యలేదు. మరి బాలయ్య కథానాయకుడు, మహానాయకుడు ప్రియమిర్స్ కి పిలిచాడా? పిలిచినా తారక్ రాలేదా? అనేది ఇపుడు తాజాగా ఫిలింసర్కిల్స్ లో నడుస్తున్న హాట్ టాపిక్. బాలయ్య పిలిస్తే తారక్ రాకపోవడమే? బాలయ్యే పిలిచి ఉండదు.. అందుకే తారక్ అలిగాడంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

Tags:    

Similar News