‘నోటా’ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి..?

Update: 2018-10-08 08:57 GMT

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ నోటా సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన నోటా మూవీ వరల్డ్ వైడ్ గా విడుదలైంది. అయితే మొదటి రోజు నోటాకి నెగెటివ్ టాక్ వచ్చినా విజయ్ దేవరకొండ క్రేజ్ వలన మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే సినిమాకి వచ్చిన టాక్ తో ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి నోటా కలెక్షన్స్ లో చాలా డ్రాప్స్ కనబడ్డాయి. ఇక సినిమాకి థియేట్రికల్ బిజినెస్ 25 కోట్ల మేర జరిగింది. అయితే ప్రస్తుతం నోటా వీకెండ్ ముగిసే సరికి పన్నెండున్నర కోట్లు కొల్లగొట్టింది. నోటా మూవీ డిజాస్టర్ లిస్ట్ లోకి చేరడానికి మరో మూడు రోజుల టైం ఉంది. ఎందుకంటే ఈ గురువారమే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత తో థియేటర్స్ లోకి దిగడంతో.. నోటా థియేటర్స్ నుండి వెళ్లిపోవడం ఖాయం. కాస్త హిట్ టాక్ వచ్చినా.. అరవింద ని తట్టుకుని నిలబడేది. ఇప్పుడు నోటా థియేటర్స్ అన్ని అరవిందకి ఇచ్చెయ్యడంతో .. నోటా కి కలెక్షన్స్ తగ్గిపోయి డిజాస్టర్ లిస్ట్ లో చేరిపోవడం ఖాయం గానే కనబడుతుంది. ఇక నోటా వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్...

ఏరియా కలెక్షన్స్ (కోట్లలో)

నైజాం 3.23

సీడెడ్ 0.82

గుంటూరు 0.52

కృష్ణ 0.47

నెల్లూరు 0.27

వెస్ గోదావరి 0.34

ఈస్ట్ గోదావరి 0.52

అర్బన్ ఏరియాస్ 0.72

ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 6.89

కర్ణాటక 1.00

ఓవర్సీస్ 1.20

ఇతర ప్రాంతాలు 0.50

తమిళనాడు 3.00

తమిళ్ వెర్షన్ 6.00

వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 12.59

Similar News