తెలంగాణలో విజయ్ ‘నోటా’ విడుదలకు చిక్కులు..?

Update: 2018-10-01 12:56 GMT

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలకు సంబంధించిన కథతో వస్తున్న ‘నోటా’ చిత్రాన్ని విడుదల కాకుండా ఆపాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. నోటా చిత్రంలో అభ్యంతర సన్నివేశాలు ఉన్నాయని, ఇది ఒక రాజకీయ పార్టీ కొమ్ముకాసే చిత్రమని మాజీ సెన్సార్ బోర్డు సభ్యుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణ లో ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ చిత్రాన్ని తెలంగాణ ఎన్నికల సంఘం కమిషనర్, డీజీపీ చూసిన తర్వాత విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. శాంతి భద్రతల సమస్యలు ఎర్పడే ప్రమాదం ఉంటుందని, అసలు ఈ చిత్ర టైటిలే ఒక వివాదం అని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధమని అంటున్నారు. ఆయన ఈ మేరకు తెలంగాణ సచివాలయంలో ఎన్నికల సంఘం కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ చిత్రం నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తి చేసుకుని ఈ నెల 5న విడుదలకు సిద్ధంగా ఉంది.

Similar News