అసలు నోటా ఎంత బిజినెస్ చేసిందో తెలుసా..?

Update: 2018-10-12 06:07 GMT

తెలుగులో రెండు సినిమాలకే మంచి పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా తమిళ డైరెక్టర్ తో 'నోటా' అనే సినిమా చేశాడు. తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ బాగానే చేసినప్పటికీ.. ఆ తర్వాత నెగటివ్ టాక్ కారణంతో వసూళ్లు పూర్తిగా తగ్గిపోయాయి. దాంతో అసలు ఈ సినిమాకి ఎంత ఖర్చు అయింది.. ఎంత బిజినెస్ చేసింది.. ఇప్పటివరకు ఎంతవరకు వసూలు చేసిందనే విషయం అందరిలోనూ ఆసక్తికరంగా మారింది.

అతిగా ఆశపడితే...

ఈ చిత్రం 12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ప్రమోషన్స్ కి 4 కోట్లు అవ్వగా.. టోటల్ గా 16 కోట్లు ఖర్చు అయింది. విజయ్ కి ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల నుండి 18 కోట్లు ఇస్తామంటూ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చినా ప్రొడ్యూసర్ ఇంకా ఎక్కువ రేట్స్ చెప్పడంతో కొనడానికి ఎవరు ముందుకు రాలేదు. దీంతో ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకున్నాడు. ఓవర్ కాంఫిడెన్స్ తో రిలీజ్ చేసుకున్న రాజాకి ఇప్పుడు భారీ నష్టాలు తప్పవని తెలుస్తుంది. ఈ సినిమా ఎఫెక్ట్ తో ప్రస్తుతం విజయ్ కొన్ని ప్రాజెక్ట్స్ హోల్డ్ లో పెట్టాడంట. మరి ఏం అవుతుందో చూడాలి.

Similar News