సమంత కాదు.. సాయి పల్లవి అట!!

టాలీవుడ్ లో సమంత – సాయి పల్లవి ఎవరికీ వారే టాలెంటెడ్ హీరోయిన్స్. ఎవరి స్టయిల్ వారిది. అయితే అజయ్ భూపతి మహాసముద్రం అక్కినేని కాంపౌండ్ లో [more]

Update: 2020-04-13 08:13 GMT

టాలీవుడ్ లో సమంత – సాయి పల్లవి ఎవరికీ వారే టాలెంటెడ్ హీరోయిన్స్. ఎవరి స్టయిల్ వారిది. అయితే అజయ్ భూపతి మహాసముద్రం అక్కినేని కాంపౌండ్ లో నాగ చైతన్య ని అనుకున్నప్పుడు మహా సముద్రం సినిమాలో సమంత నే హీరోయిన్ ని అనుకున్నారు. సమంత అయితే మహాసముద్రం కథని విని నచ్చింది అని.. హీరోయిన్ గా సమంత ఓకె అనుకున్నారు. అయితే నాగ చైతన్య మహాసముద్రం కథని రిజెక్ట్ చేసినప్పుడు ఆ స్క్రిప్ట్ ని శర్వానంద్ ఓకె చేసాడు. అప్పుడు సమంత నే హీరోయిన్ అన్నారు. భర్త ఒప్పుకోలేదు.. భార్య ఎలా చేస్తుందో అన్నారు.

అయితే తాజాగా అజయ్ భూపతి – శర్వానంద్ కంబోలో మహా సముద్రం సినిమా కరోనా లక్డౌన్ పూరితో కాగానే పట్టాలెక్కబోతుంది. అయితే ఈ సినిమాని సమంత కూడా రిజెక్ట్ చేసిందని.. సమంత ప్లేస్ లోకి అజయ్ భూపతి సాయి పల్లవిని సెలెక్ట్ చేసాడనే టాక్ వినబడుతుంది. మరి శర్వానంద్ తో సమంత అయినా సూపర్.. ఎందుకంటే జానూ సినిమాలో శర్వా – సమంత కెమిస్ట్రి అదుర్స్ గనక. ఇక సాయి పల్లవి అయినా శర్వకి పర్ఫెక్ట్ జోడి. ఎందుకంటే పడి పడి లేచే మనసు సినిమాలో శర్వా – సాయి పల్లవి నటన సూపర్. సో శర్వకి ఏ హీరో అయినా ఓకె.. కాకపోతే ఫైనల్ గా సాయి పల్లవి దగ్గరే అజయ్ భూపతి ఆగాడట. ఇప్పటికే సాయిపల్లవికి కథ కూడా వివరించార‌ట. సాయి పల్లవి కూడా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News