నాకు అలాంటి అవకాశాలు రాలేదంటున్న హీరోయిన్!!

RX 100 తో యూత్ ని ఓ ఊపు ఊపిన పాయల్ రాజపుట్.. గ్లామర్ పాత్రలకి బోల్డ్ పాత్రలకి యంగ్ హీరోల పక్కన సూపర్ జోడి అనుకున్నారు [more]

Update: 2020-07-07 06:34 GMT

RX 100 తో యూత్ ని ఓ ఊపు ఊపిన పాయల్ రాజపుట్.. గ్లామర్ పాత్రలకి బోల్డ్ పాత్రలకి యంగ్ హీరోల పక్కన సూపర్ జోడి అనుకున్నారు కానీ.. పిలిచి అవకాశం ఇచ్చిన పాపన పోలేదు. కనీసం సీనియర్ హీరోలైన పాయల్ రాజపుట్ ని ఆదుకోలేదు. తాజాగా పాయల్ రాజపుట్ ఐటెం గర్ల్ గా సెటిల్ కాబోతుంది అనే టాక్ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. లోకనాయకుడు కమల్ హాసన్ తో భరతీయుడు 2 లో పాయల్ రాజపుట్ ఐటెం సాంగ్ లో ఆడబోతుంది అని.. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో ఐటెం తో అదరగొట్టిన పాయల్ రాజపుట్ ని భారతీయుడు కోసం శంకర్ ఐటెం సాంగ్ కి ఎంపీక చేసారని.. లోకనాయకుడితో పాప ఐటెం సాంగ్ లో డాన్స్ వెయ్యబోతున్నట్టుగా వార్తలొచ్చాయి.

అలాగే అల్లు అర్జున్ – సుకుమార్ పుష్ప లోను పాయల్ కి ఐటెం సాంగ్ వచ్చింది అంటున్నారు. పుష్ప లో మాత్రం బాలీవుడ్ పాపే ఐటెం గర్ల్ కానీ.. భారతీయుడు 2 లో పాయల్ ఆటాపాటా పక్కా అన్నారు. కానీ తాజాగా పాయల్ ఐటెం సాంగ్స్ లో నేను నటించడం లేదంటుంది. ఇలాంటి గాలి వార్తలు ఎలా పుడతాయో తెలియదంటుంది. నేను ఎలాంటి స్పెషల్ ఐటెం సాంగ్స్ చెయ్యడం లేదు. తెలిసిన వాళ్లంతా భారతీయుడు 2, పుష్ప లో ఐటెం సాంగ్స్ చేస్తున్నారట అని అడుగుతున్నారు. కానీ నేను ఎలాంటి ఐటమ్స్ చెయ్యడానికి ఏ సినిమాకి సైన్ చెయ్యలేదు. అంతేకాదు లక్డౌన్ సమయంలో నెను ఇంతవరకు ఎలాంటి షూటింగ్ లోను పాల్గొనలేదు, కొత్త కథలను వినలేదు. మంచి కథలు వస్తేనే సినిమా ఒప్పుకుంటాను అని చెబుతుంది.

Tags:    

Similar News