సంక్రాతి వద్దంటున్న పవన్?

రాజకీయాలను, సినిమా షూటింగ్స్ ని వదిలేసి.. కరోనా కారణంగా ఏడు నెలలు ఇంట్లోనే ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా వకీల్ సాబ్ షూటింగ్ తో పాటుగా రాజకీయాల్లోనూ [more]

Update: 2020-11-17 17:19 GMT

రాజకీయాలను, సినిమా షూటింగ్స్ ని వదిలేసి.. కరోనా కారణంగా ఏడు నెలలు ఇంట్లోనే ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా వకీల్ సాబ్ షూటింగ్ తో పాటుగా రాజకీయాల్లోనూ బిజీ అయ్యాడు. నిన్నటివరకు థియేటర్స్ బంద్ కారణంగా సినిమాల షూటింగ్స్ అన్ని ఆగిపోయి.. రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ చెయ్యలేక.. చేస్తుంటే.. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ విడుదల డాట్ విషయం తేలడం లేదు. అసలు వకీల్ సాబ్ ముచ్చట దిల్ రాజు మరిచిపోయినట్టుగా ఉన్నాడు. లేదంటే వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ఎప్పుడో ఇచ్చేసేవాడే. ప్రస్తుతం మీడియం, చిన్న హీరోలే సంక్రాంతికి టార్గెట్ చేస్తూ విడుదల డేట్స్ ప్రకటించాయి.

ఇండస్ట్రీలో షూటింగ్స్, విడుదల డేట్స్ లో చాలామంది హీరోలు సంక్రాంతికే స్టిక్ అవుతుంటే… వకీల్ సాబ్ విడుదల తేదీ విషయంలో పవన్ – దిల్ రాజు లు మాత్రం గమ్మునుంటున్నారు. వకీల్ సాబ్ ఎప్పుడు వస్తుందో క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే పవన్ ఫాన్స్ మాత్రం సంక్రాంతికి వకీల్ సాబ్ పక్కా అనుకుంటూన్నారు. కానీ తాజాగా పవన్ సంక్రాతి వద్దు… ఏప్రిల్ లో సినిమాని విడుదల చేద్దాం.. ఎలాగూ థియేటర్స్ ఓపెన్ చేసినా 50 శాతం అక్యుపెన్సీతో వర్కౌట్ అవ్వదు.. అలాగే ప్రేక్షకులు సినిమాని 100 శాతం ఎంజాయ్ చెయ్యలేరు. అదే ఏప్రిల్ అయితే ఆరామ్స్ గా ఉంటుంది. అప్పటికి కరోనా తగ్గి థియేటర్స్ పై ఫుల్ క్లారిటీ ఉంటుంది.. సో అప్పుడు వకీల్ సాబ్ ని విడుదల చేద్దామని దిల్ రాజు – పవన్ ఫిక్స్ అయినట్లుగా.. సంక్రాతి బరిలో వకీల్ సాబ్ తప్పుకున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతుంది.

Tags:    

Similar News