అప్పుడు టివి కానీ ఫ్రెండ్స్ కానీ లేరంటున్న హీరోయిన్?

ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న చాలామంది హీరోయిన్స్ చిన్నప్పటినుండి పెద్ద రిచ్ కాదు… సమంత లాంటి చాలామంది హీరోయిన్స్ మిడిల్ క్లాస్ నుండి వచ్చి టాప్ [more]

Update: 2020-09-23 10:49 GMT

ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న చాలామంది హీరోయిన్స్ చిన్నప్పటినుండి పెద్ద రిచ్ కాదు… సమంత లాంటి చాలామంది హీరోయిన్స్ మిడిల్ క్లాస్ నుండి వచ్చి టాప్ హీరోయిన్స్ గా కోట్లు గడిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బడా హీరోయిన్ దీపికా పడుకునే చిన్నప్పుడు ముచ్చట్లను రివీల్ చేసింది. ప్రస్తుతం ప్రభాస్ – నాగ్ అశ్విన్ మూవీ కి కమిట్ అయిన దీపికా బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ తో కపిల్ దేవ్ బయోపిక్ 83 లో నటించింది. అలాగే తనకి భారీ హిట్స్ ఇచ్చిన షారుఖ్ తో మరోసారి జోడి కట్టబోతున్న దీపికా పైనే సౌత్ కళ్ళు ఉన్నాయి… కారణం ప్రభాస్ సినిమానే.

అయితే దీపికా తన చిన్నప్పుడు స్కూల్ కి వెళ్లొచ్చాక టీవీ చూడడం కానీ, ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పడం కానీ చేసేది కాదట. అలాగే సినిమాలు షికార్లు కు కూడా వెళ్ళేదికాదట. స్కూల్ నుండి ఇంటికి రాగానే దీపికా స్కూల్ డ్రెస్ మార్చుకుని బ్యాగ్ పెట్టేసి స్నాక్స్ తినేసి బ్యాట్మెంటన్ ఆడడానికి వెళ్లిపోయేదట. స్కూల్ అవ్వగానే ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకోవడానికి టైం ఉండేది కాదట. బ్యాట్మెంటన్ నుండి ఇంటికొచ్చి భోజనం చేసి అలసటగా నిద్రపోయేదట. ప్రతి రోజు నా దినచర్య ఇలానే ఉండేది. సినిమాలకి వెళ్ళడానికి షికార్లు తిరగడానికి, టివి చూడడానికి టై ఉండేది కాదు. చిన్నప్పటినుండి గేమ్స్ ఆడితే అదే మనకి క్రమశిక్షణ నేర్పుతుందని చెబుతుంది దీపికా.

Tags:    

Similar News