డిస్కో రాజా లో అది మిస్ అయ్యిందే

రవితేజ డిస్కో రాజా సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. ఎందుకంటే రెండు డిజాస్టర్ తో కాస్త వెనకబడిన రవితేజ డిస్కో రాజాతో ఎలాగైనా హిట్ కొట్టాలని… కాదు [more]

Update: 2020-01-21 05:15 GMT

రవితేజ డిస్కో రాజా సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. ఎందుకంటే రెండు డిజాస్టర్ తో కాస్త వెనకబడిన రవితేజ డిస్కో రాజాతో ఎలాగైనా హిట్ కొట్టాలని… కాదు కొడుతున్నాం అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడాడు కూడా. అయితే రవితేజ క్రేజ్ కి బ్రేకులేసిన డిజాస్టర్స్ తో డిస్కో రాజాపై భారీ అంచనాలు లేకపోయినా.. రవితేజ ప్రమోషన్స్ తో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నాడు. ఇక రేపు శుక్రవారం రాబోతున్న డిస్కో రాజా సెన్సార్ కూడా పూర్తయ్యింది. యు/ఏ సర్టిఫికెట్ తో డిస్కో రాజా రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే సినిమాపై ఎంత అంచనాలున్నప్పటికీ… ప్రేక్షకులు, అభిమానులు ఆ సినిమా ట్రైలర్ కోసం ఎదురు చూస్తారు

మరి అందరూ ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ కో, లేదంటే ప్రత్యేకించి ట్రైలర్ రిలీజ్ అంటూ అహడావిడీ చేస్తూ ఆయా సినిమాల ట్రైలర్స్ రిలీజ్ చేస్తుంటారు. కానీ రవితేజ డిస్కో రాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసాడు… ట్రైలర్ రిలీజ్ చెయ్యలేదు. కానీ అభిమానులేమో డిస్కో రాజా ట్రైలర్ కోసం వెయిటింగ్ అంటున్నారు. ప్రేక్షకులు కూడా డిస్కో రాజా ట్రైలర్ చూసి సినిమాకి పోదామనే ధ్యాసలో టికెట్ బుకింగ్స్ చేస్తారు. కానీ రవితేజ ట్రైలర్ ఇస్తాడో… లేదంటే.. ఏకంగా సినిమానే చూపెడతాడో అనేది క్లారిటీ లేదు. అందుకే డిస్కో రాజా విషయంలో ఏదో మిస్ అయ్యింది అనే భావన కలుగుతుంది. మరి మీకో.

Tags:    

Similar News