రజినికే ఇలాంటి పరిస్థితా…?

ప్రస్తుతం టాలీవుడ్ లో థియేటర్స్ విషయమై ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఎందుకంటే సంక్రాతి సీజన్ కి మూడు నాలుగు సినిమాలు విడుదలవడమే ఈ థియేటర్స్ సమస్యకు [more]

Update: 2019-01-08 03:47 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో థియేటర్స్ విషయమై ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఎందుకంటే సంక్రాతి సీజన్ కి మూడు నాలుగు సినిమాలు విడుదలవడమే ఈ థియేటర్స్ సమస్యకు అతి పెద్ద కారణం. తెలుగులో మూడు భారీ సినిమాలు సంక్రాంతికే వస్తున్నాయి. ఎప్పుడో తమ సినిమాలను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లుగా ఆయా నిర్మాతలు ప్రకటించారు కూడా. భారీ గా తెరకెక్కిస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్, రామ్ చరణ్ వినయ విధేయరామ, వరుణ్ – వెంకీల ఎఫ్ టు చిత్రాలు సంక్రాతి బరిలో దిగుతున్నట్లుగా గత రెండు నెలల క్రితమే డిసైడ్ అయ్యింది. ఈలోపు కోలీవుడ్ నుండి రజినికాంత్ నటించిన పెటా సినిమా కూడా ఈ సంక్రాంతికే రెడీ అయ్యింది. అసలే లాస్ట్ మినిట్ అంటే పండక్కి పది రోజుల ముందు సంక్రాతి బరిలోకి వచ్చిన పెటా కి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్స్ దొరకడంకష్టమైంది.

గత రాత్రి పేట ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమ సినిమాకు థియేటర్లు లేకుండా దిల్ రాజు, అల్లు అరవింద్ , సురేష్ బాబు లాంటివారు అడ్డుపడుతున్నారని.. పేట తెలుగు హక్కులు కొన్న నిర్మాత వల్లభనేని అశోక్ చెప్పాడు. అంతేకాదు థియేటర్స్ మాఫియాను పెంచి పోషించిన వాళ్ళని షూట్ చెయ్యాలంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసాడు. రజనీకాంత్ , సిమ్రాన్ ,త్రిష ,విజయ్ సేతుపతి పేట సినిమా రేపు గురువారం అంటే జనవరి పదినే ప్రేక్షకుల ముందు రాబోతుంది. అయితే తొమ్మిదన అంటే రేపు ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ని భారీగా గా విడుదల చేస్తున్నారు.

మరోపక్క శుక్రవారం రామ్ చరణ్ వినయ విధేయరామ కూడా భారీగా విడుదల కాబోతుంది. ఇక శనివారం మరో తెలుగు సినిమా ఎఫ్ టు ని కూడా భారీ లెవల్లో దిల్ రాజు విడుదల చేస్తున్నాడు. మరి ఎన్టీఆర్ బయోపిక్ కి ఎఫ్ టు కి కలిపి నిర్మాత సురేష్ బాబు థియేటర్స్ బ్లాక్ చేసాడు. ఇక అరవింద మేనల్లుడు రామ్ చరణ్, వరుణ్ ల కోసమే థియేటర్స్ బ్లాక్ చేసాడు ఇక దిల్ రాజు సంగతి చెప్పక్కర్లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పేట విడుదల తలకు మించి భారమే అవుతుంది. అయినా రజినీకాంత్ లాంటి క్రేజున్న స్టార్ కె ఇలాంటి థియేటర్స్ సమస్య తలెత్తితే.. చిన్న చితక హీరోల పరిస్థితి ఏమిటో కదా… అయినా లాస్ట్ మినిట్ లో విడుదలకు సిద్దమయిన పేట కు ఇలాంటి పరిస్థితి రావడం పరిపాటే అంటున్నారు కొంతమంది .

Tags:    

Similar News