డ్రగ్స్ కేసుపై స్పందించేందుకు నిరాకరణ?

డ్రగ్స్ కేసులో ముఖ్యంగా ఇప్పుడు రకుల్ పేరు బయటికి రావడంతో టాలీవుడ్ మొత్తం షాకయ్యింది. ఈమధ్యనే బాలీవుడ్ లో మూవీస్ చేస్తున్న రకుల్ అక్కడ అవార్డు ఫంక్షన్స్ [more]

Update: 2020-09-13 06:23 GMT

డ్రగ్స్ కేసులో ముఖ్యంగా ఇప్పుడు రకుల్ పేరు బయటికి రావడంతో టాలీవుడ్ మొత్తం షాకయ్యింది. ఈమధ్యనే బాలీవుడ్ లో మూవీస్ చేస్తున్న రకుల్ అక్కడ అవార్డు ఫంక్షన్స్ కి, పార్టీలకు తరుచు హాజరవడం, ఇప్పుడు సుశాంత్ సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొటున్న రియా చక్రవర్తి.. డ్రగ్స్ కేసులో రకుల్ పేరు బయటపెట్టడంతో అంతా షాకయ్యారు. లాక్ డౌన్ తర్వాత అందరికన్నా ముందు క్రిష్ డైరెక్షన్ లో మూవీ కి కమిట్ అయిన రకుల్.. ఇప్పుడా షూటింగ్ లో బిజీగా ఉంది. ఎప్పుడు జిమ్, వర్కౌట్స్, యోగ చేస్తూ బిజీగా వుండే రకుల్ డ్రగ్స్ తీసుకుందా? అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇక క్రిష్ సినిమా షూటింగ్ కోసం వికారాబాద్ అడవుల్లో షూటింగ్ స్పాట్ లో ఉన్న రకుల్… తన పేరు డ్రగ్స్ కేసులో బయటికొచ్చిన విషయం మీడియా ద్వారా తెలుసుకున్న రకుల్ షూటింగ్ స్పాట్ నుండి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ డ్రగ్స్ సేవించిన విషయంలో రకుల్ ని ఎన్సీబీ అధికారులు వివరణ కోరగా రకుల్ స్పందించలేదని తెలుస్తుంది. తాను ఏ పార్టీకి హాజరవలేదని కానీ, తాను డ్రగ్స్ తీసుకోలేదని కానీ రకుల్ చెప్పకుండా విచారణకుగా అందుబాటులోకి రావడం లేదని, ప్రస్తుతం మీడియా మొత్తం హైదరాబాదులో రకుల్ నివాసముంటున్న ఇంటి చుట్టూనే తిష్టవేసినట్టుగా తెలుస్తుంది. 

Tags:    

Similar News