క్రేజ్ ఎక్కడ విజయ్?

విజయ్ దేవరకొండ క్రేజ్ ఇప్పుడు బాలీవుడ్ లో ఓ రేంజ్ లో ఉంది. అందుకే విజయ్ ఫోకస్ మొత్తం బాలీవుడ్ మీదే పెట్టాడు. ఫైటర్ సినిమాని పాన్ [more]

Update: 2020-01-28 08:08 GMT

విజయ్ దేవరకొండ క్రేజ్ ఇప్పుడు బాలీవుడ్ లో ఓ రేంజ్ లో ఉంది. అందుకే విజయ్ ఫోకస్ మొత్తం బాలీవుడ్ మీదే పెట్టాడు. ఫైటర్ సినిమాని పాన్ ఇండియా మూవీ గా చేస్తున్నాడు కూడా. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫైటర్ ముచ్చట్లు వినిపించినతగా అతను నటించిన తాజా చిత్రం వరల్డ్ ఫెమస్ లవర్ విశేషాలు మీడియాలో హైలెట్ కావడం లేదు.. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున విడుదల చేస్తున్న వరల్డ్ ఫెమస్ లవర్ కి అస్సలు క్రేజ్ రావడం లేదు. లుక్స్ ఒక్కొక్కటిగా బయికొచ్చాయి. ప్రస్తుతం సింగిల్స్ తో హడావిడి చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఈ సినిమా ప్రమోషన్స్ మొదలెట్టినప్పటికీ ఎందుకో తేడా కొడుతోంది.

విజయ్ దేవరకొండ గత సినిమాలకు వచ్చినంత క్రేజ్ ఈ సినిమాకి రావడం లేదు. నలుగురు హీరోయిన్స్ నటించగా.. ఏమాత్రం క్రేజ్ కనబడడం లేదు. అసలు రౌడీ విజయ్ సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హడావిడి చేస్తారు. కానీ వరల్డ్ ఫెమస్ లవర్ విషయంలో అలాంటిదేం కనిపించడం లేదు. మరి సినిమాపై క్రేజ్ లేదా? విజయ్ క్రేజ్ తగ్గిందా? అనే డౌట్ కొడుతోంది. వరల్డ్ ఫెమస్ లవర్ పోస్టర్స్ చూసాక అంతా.. ఈ సినిమా అర్జున్ రెడ్డి టైపు అని ఫిక్స్ అయ్యారు. మరి వరల్డ్ ఫెమస్ ట్రైలర్ ఏమైనా వస్తే గాని సినిమాపై జనాల్లో ఆసక్తి మొదలయ్యేలా కనిపించడం లేదు. మరి విజయ్ ఈ విషయాన్నీ గమనిస్తున్నాడో.. లేదో.. చూద్దాం.

Tags:    

Similar News