భారం అంతా వాళ్లదే!!

ఏదైనా సినిమా విడుదలవుతుంది అంటే ఆ సినిమా యూనిట్ చేసేహడావిడితోనే ప్రేక్షకుల్లో ఆ సినిమాపై ఇంట్రెస్ట్ కలుగుతుంది. అది థియేటర్స్ లో విడుదల కానివ్వండి, ఓటిటీస్ లో [more]

Update: 2020-08-02 05:33 GMT

ఏదైనా సినిమా విడుదలవుతుంది అంటే ఆ సినిమా యూనిట్ చేసేహడావిడితోనే ప్రేక్షకుల్లో ఆ సినిమాపై ఇంట్రెస్ట్ కలుగుతుంది. అది థియేటర్స్ లో విడుదల కానివ్వండి, ఓటిటీస్ లో విడుదల కానివ్వండి. ఎందులో విడుదలకైనా ఆ సినిమా యూనిట్ తమ సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం హడావిడి చేస్తారు. మాములుగా అయితే ప్రెస్ మీట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉండేవి. కానీ కరోనా వలన కేవలం సోషల్ మిడియా ప్రమోషస్న్ తప్ప మరే ఇతర ప్రెస్ మీట్స్ కి ఛాన్స్ లేదు. అయినా బుల్లితెర మీద కొత్త సినిమా ప్రసారం అయిన ఆయా సినిమాల చిత్ర బృందాలు.. ప్రమోట్ చేస్తున్న రోజుల్లో.. ఓటిటి ద్వారా విడుదలవుతున్న సినిమాలకు కనీసం ప్రమోషస్న్ లేవు.

ప్రస్తుతం ఓటిటి నుండి విడుదలవుతున్న సినిమాలు ఎప్పుడు విడుదలవుతున్నాయో కూడా ఆర్షం కావడం లేదు. సైలెంట్ గా డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో ప్రత్యక్షం అవుతున్నాయి. మొన్నటికి మొన్న సిద్దు జొన్నలగడ్డ కృష్ణ హిస్ లీల సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ వారు ఎలాంటి హడావిడి లేకుండా నెట్ ఫ్లిక్స్ లో పెట్టారు. ఉదయం ట్విట్టర్ లో చూసేవరకు ఆ సినిమా విడుదలైనట్లుగా ఎవరికీ తెలియదు. అలాగే నిన్నగాక మొన్న విడుదలైన సత్యదేవ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య కూడా అంతే. సత్య దేవ్ ఉమామామహేశ్వర ఉగ్ర రూపస్య ఓటిటి లో విడుదల చేస్తామని నిర్మాతలు అన్నారు కానీ… ఎప్పుడో డేట్ ఇవ్వలేదు. నిన్న గురువారం ఆ సినిమా విడుదలయ్యే వరకు ఎవరికి ఆ సినిమా ఆ రోజు విడుదలవుతుంది ఆనేది తెలియదు. మరి బాలీవుడ్ లో శకుంతలాదేవి బయోపిక్ కోసం విద్య బాలన్ ఎంత కావాలో అంత ప్రమోషన్ చేసింది. సోషల్ మీడియాలోనే ఆ సినిమాని భీభత్సంగా ప్రమోట్ చేసింది. కానీ తెలుగులో మాత్రం కరొనకి భయపడుతున్నారా.. లేదంటే ఓటిటిలోనే కదా మనకెందుకులే అనుకున్నారో.. అసలు ప్రమోషస్న్ లేకుండా సినిమాలను ఓటిటీల్లో వదులుతున్నారు

Tags:    

Similar News