హీరోలకు వేరే ఆప్షన్ లేదా..?

టాలీవుడ్ హీరోలకు హీరోయిన్స్ కరువయ్యారా… అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్ హీరోలకు మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ కనబడం లేదు. కాజల్, సమంత, తమన్నా,అనుష్క, నయనతార [more]

Update: 2019-02-16 08:48 GMT

టాలీవుడ్ హీరోలకు హీరోయిన్స్ కరువయ్యారా… అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్ హీరోలకు మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ కనబడం లేదు. కాజల్, సమంత, తమన్నా,అనుష్క, నయనతార వంటి హీరోయిన్స్ సీనియర్స్ లిస్ట్ లోకి చేరిపోవడంతో.. ప్రస్తుతం స్టార్ హీరోలకు హీరోయిన్స్ కొరత ఏర్పడింది. ఏదో ఒక హీరోయిన్ ఒక హిట్ కొట్టాక ఆమె వెనుక పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆ హీరోయిన్ కి మళ్లీ ఫ్లాప్ పడితే మరో ఆప్షన్ వెతుక్కోవడం. గత ఏడాది అను ఇమ్మాన్యువల్ కాస్త స్టార్ హీరోల సినిమాల్లో కనబడితే… రెండు మూడు ఫ్లాప్స్ పడేసరికి అనుని పక్కన పడేసారు. కైరా అద్వానీ పరిస్థితీ అదే. భరత్ అనే నేనుతో పర్వాలేదనిపించే హిట్ తో ఉంటే.. రామ్ చరణ్ తో వినయ విధేయ రామతో ఫ్లాప్ పడేసరికి కైరాకు అవకాశాలు మొహం చాటేశాయి.

అందరూ ఆమె చుట్టే…

ఇక డీజేతో యావరేజ్ హిట్ కొట్టిన పూజా హెగ్డే వెనకాలే స్టార్ హీరోలు, దర్శకనిర్మాతలు పడుతున్నారు. ఇండస్ట్రీలోని టాప్ హీరోలందరి సరసన పూజా హెగ్డేనే హీరోయిన్. మరి పూజా హెగ్డే లో గ్లామర్ ఉంది కానీ.. ఆమెకి నటన ఓ అన్నంత రాదు. కానీ హీరోలకు వేరే ఆప్షన్ లేక పూజా కోసం వెంటపడుతున్నారు. క్రేజ్ ఉన్న మరే హీరోయిన్ దొరకక ఆమె చుట్టూనే తిరగాల్సిన పరిస్థితి. ఇప్పటివరకు పూజ హెగ్డేకి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు. డీజే దువ్వాడ జగన్నాధం యావరేజ్ హిట్ అయితే.. అరవింద సమేత కూడా యావరేజే అయ్యింది. కానీ పూజా డిమాండ్ తగ్గలేదు.

మళ్లీ అల్లు అర్జున్ తో…

ఇప్పటికే పూజా నటిస్తున్న మహేష్ మహర్షి సినిమా విడుదలకు రెడీ అవుతుంటే.. ప్రభాస్ సినిమా సెట్స్ మీదుంది. ఇక తాజాగా త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమాలోనూ పూజానే ఫైనల్ చేశారు అని అంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ తో డీజే దువ్వాడ జగన్నాధం సినిమాతో ఒక ఊపు ఊపిన పూజా హెగ్డే ఇప్పుడు మరోమారు జతకడుతుంది. మరి పూజా హెగ్డే లాక్కో. హీరోలకు వేరే దిక్కులేకో… ఆమెనే అందరికీ బెస్ట్ ఆప్షన్ అయ్యింది.

Tags:    

Similar News