ఎన్టీఆర్ కు ఆహ్వానం అందలేదా..?

Update: 2018-12-15 08:34 GMT

మొన్నటివరకు ఎన్టీఆర్ - బాలయ్య కలుస్తారా..? కలవరా..? అని అనుకున్నారు. తీరా కలిశాకా ఎన్టీఆర్ ను బాలయ్య ఆ ఫంక్షన్ కి పిలుస్తాడా? బాలయ్యను ఎన్టీఆర్ ఈ ఫంక్షన్ కి పిలుస్తాడా అని మొదలయ్యాయి. అవును మరో వారం రోజుల్లో ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కృష్ణ జిల్లా నిమ్మకూరులో జరగనుంది. డిసెంబర్ 21న జరిగే ఈ ఫంక్షన్ కి నందమూరి ఫ్యామిలీ మొత్తం అటెండ్ అవ్వనుంది. నందమూరి ఫ్యామిలీ అంటే అందరూ వస్తారు కాబట్టి ఆ ఫంక్షన్ జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తాడా..? అసలు ఆయనను ఆహ్వానిస్తారా..? ఎన్టీఆర్ పాటు తన తల్లిని కూడా పిలుస్తారా..? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.

ఎన్టీఆర్ ని పిలవడం మాత్రం ఖాయం

అయితే తాజా సమాచారం ప్రకారం ఇంతవరకు ఎన్టీఆర్ కు ప్రీ రిలీజ్ ఆహ్వానం అందలేదని తెలుస్తుంది. ఎన్టీఆర్ తల్లిని పిలిచినా పలవకపోయిన ఎన్టీఆర్ ని అయితే కచ్చితంగా పిలుస్తారు అని బాలయ్య దగ్గరి సన్నిహితులు అంటున్నారు. మరో వారం టైం ఉంది కాబట్టి ఈ లోపల ఎన్టీఆర్ ను బాలయ్య పిలిచే అవకాశం ఉంది అని చెబుతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లో కళ్యాణ్ రామ్ ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ ను ఎలాగూ పిలుస్తారు. బాలయ్య 'అరవింద సమేత' సక్సెస్ మీట్ కు వచ్చాడు కాబట్టి ఎన్టీఆర్ కూడా ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ వస్తాడు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఒకవేళ ఎన్టీఆర్ ను పిలిస్తే, ఆయన వెళ్తే మాత్రం ఫంక్షన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాడు. మరి బాలయ్య కు ఇది నచ్చుతుందో లేదో.

Similar News