96 కి ఏమైంది

తమిళంలో బిగ్గెస్ట్ హిట్ 96 సినిమా ని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. తమిళంలో విజయ్ సేతుపతి – త్రిష జంటగా తెరకెక్కిన [more]

Update: 2019-07-09 06:25 GMT

తమిళంలో బిగ్గెస్ట్ హిట్ 96 సినిమా ని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. తమిళంలో విజయ్ సేతుపతి – త్రిష జంటగా తెరకెక్కిన 96 సినిమా సూపర్ హిట్ కాదు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమాని ఎలాగైనా తెలుగులో రీమేక్ చెయ్యాలని దిల్ రాజు ఉవ్విళ్ళూరడమే కాదు… శర్వానంద్ హీరోగా సమంత హీరోయిన్ గా ఆ సినిమా ఎప్పుడో మొదలెట్టాడు. అయితే 96 మొదలైంది కానీ.. హీరో శర్వానంద్ కానీ.. హీరోయిన్ సమంత కానీ ఆ 96 విషయాలపై ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. ఇక ఆ సినిమా మొదలైనపుడు హడావిడి చేసిన దిల్ రాజు కూడా ఆ సినిమా ముచ్చట్లు ఎక్కడా చెప్పడమే లేదు. ఈమధ్యలో శర్వానంద్ భుజానికి గాయమైంది. ఇక గాయమై భుజానికి ఆపరేషన్ చేయించుకున్నాడు శర్వా. అయినా రెండు వారాల రెస్ట్ తో మరో సినిమాని మొదలెట్టాడు. ఇక సుధీర్ వర్మతో రణరంగం షూటింగ్ పూర్తవడము… ఆసినిమా ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి.

ఇక సమంత అయితే ఓ బేబీ సినిమా మ్యానియా నుండి బయటికి రాలేదు. తాను ఎంతో ఇష్టపడి చేసిన ఓ బేబీ కి సమంత చేసిన ప్రమోషన్స్ అలాంటి ఇలాంటివి కాదు. ఇక సినిమా విడుదలయ్యాక కూడా సక్సెస్ మీట్స్ తో హోరెత్తిస్తుంది కానీ…. 96 సినిమా రీమేక్ ముచ్చట ఎక్కడా చెప్పడం లేదు. అందుకే ఇప్పుడు దిల్ రాజుగారి 96 పరిస్థితి ఏమిటా అని ఆరాలు తీస్తున్నారు. మరి దిల్ రాజు మేలుకుని 96 సినిమా అప్ డేట్ ఏమైనా మీడియాకి అందిస్తే… ఓకె… లేదంటే ఇలాంటి అనుమానాలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతాయి.

Tags:    

Similar News