మేకప్ లేదూ.. మోనిటర్ లేదు!!

ఇప్పుడు సినిమాల్లో నటించే హీరో హీరోయిన్స్.. షూటింగ్ లో ఓ టెక్ చెయ్యగానే వెంటనే మోనిటర్ దగ్గరకి వెళ్ళిపోయి తాము ఎలా ఉన్నామో.. మేకప్ పర్ఫెక్ట్ గా [more]

Update: 2020-10-07 05:22 GMT

ఇప్పుడు సినిమాల్లో నటించే హీరో హీరోయిన్స్.. షూటింగ్ లో ఓ టెక్ చెయ్యగానే వెంటనే మోనిటర్ దగ్గరకి వెళ్ళిపోయి తాము ఎలా ఉన్నామో.. మేకప్ పర్ఫెక్ట్ గా ఉందా? ఎలా నటించామో అనే అతృతతో చూసుకుంటారు. కానీ అసలు మోనిటర్ లో చూడకుండా ఓ సినిమాలో నటించిందట మహానటి కీర్తి సురేష్. ప్రస్తుతం నితిన్ రంగ్ దే సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్.. మహేష్ సర్కారు వారి పాట కోసం అమెరికా ఫ్లైట్ ఎక్కబోతుంది. ఇక కీర్తి సురేష్ నటించిన గుడ్ లక్ సఖి సినిమా విడుదలకు సిద్దమవుతుంది. అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ అసలు మేకప్ వేసుకోకుండా డి గ్లామర్ గా నటించిందట. ఇక కీర్తి సురేష్ నటించిన సీన్స్ ని కనీసం మోనిటర్ లో కూడా చూసుకోలేదట.

మరి టెక్నాలజీ ఇంతగా పెరిగిపోయిన టైం లో కీర్తి సురేష్ డీ గ్లామర్ గా నటించడం పెద్ద మేటర్ కాదు కానీ.. కనీసం తానెలా చేసానో మోనిటర్ లో చూసుకోకపోవడం మాత్రం పెద్ద విషయమే. అయితే కీర్తి సురేష్ అలా చెయ్యడానికి కారణం దర్శకుడు నగేష్ ఇచ్చిన సలహానే అంట. నగేష్ చెప్పాడని కీర్తి సురేష్ మోనిటర్ లో తానెలా నటించానో అనే విషయం కనీసం చెక్ చేసుకోలేదట.. ఇక పాత్రలో సహజత్వం కోసం మేకప్ వేసుకోకుండా నటించా అని చెబుతుంది. ఈ సినిమా కోసం మహానటి కీర్తి సురేష్ ఎంతగా కష్టపడి డేడికేషన్స్ తో వర్క్ చేసిందో చూస్తే సినిమాపై క్రేజ్ మరింత పెరుగుతుంది. అయితే ఈ సినిమా కూడా ఓటిటిలో రిలీజ్ అవుతుందనే ప్రచారం ఉంది.

Tags:    

Similar News