హని మూన్ లేదూ… ఏమి లేదూ!!

హీరోయిన్ అయినా, హీరో అయినా ఏ సెలెబ్రిటీ అయినా పెళ్లి తర్వాత ఎక్కడో చోటికి హాని మూన్ కి వెళ్లడం చూస్తూనే ఉంటాం. కానీ కొంతమంది హీరోయిన్స్ [more]

Update: 2020-10-31 04:19 GMT

హీరోయిన్ అయినా, హీరో అయినా ఏ సెలెబ్రిటీ అయినా పెళ్లి తర్వాత ఎక్కడో చోటికి హాని మూన్ కి వెళ్లడం చూస్తూనే ఉంటాం. కానీ కొంతమంది హీరోయిన్స్ అయినా హీరోస్ అయినా తమ బిజీ షెడ్యూల్స్ వలన హాని మూన్ పోస్ట్ పోన్ చేసుకుని సినిమా షూటింగ్స్ కి హాజరవుతుంటారు. అయితే గతంలో టాప్ రేంజ్ లో దూసుకుపోతున్న సమంత పెళ్లి చేసుకున్నప్పుడు చాలా సినిమాల షూటింగ్స్ బ్యాలెన్స్ ఉండడంతో… పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకుని హాని మూన్ అంటూ ఎంజాయ్ చెయ్యకుండా సినిమా షూటింగ్ లకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా పెళ్లి తర్వాత నో గ్యాప్.. నో హాని మూన్ అంటుంది.

ఆమె కాజల్ అగర్వాల్. నిన్న పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్.. తాను నటించాల్సిన సినిమా షూటింగ్స్ కి ఎలాంటి ఆటంకం లేకుండా షూటింగ్స్ కి హాజరవుతా అంటుంది. గత వారం రోజులుగా పెళ్లి సంబరాల్లో హుషారుగా పాల్గొంటున్న కాజల్ అగర్వాల్ నిన్న రాత్రి గౌతమ్ కిచ్లు ని హడావిడి లేకుండా పెళ్లి చేసుకుంది. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, కొద్దిమంది అతిధుల మధ్యన పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత నో హాని మూన్ అంటుంది. హాని మూన్ లాంటిదేం లేదూ.. నేను హాజరవ్వాల్సిన షూటింగ్స్ ఉన్నాయి.. సో ఫస్ట్ షూటింగ్ తర్వాతే హాని మూన్ అంటుంది ఈ చందమామ. మరి కాజల్ అగర్వాల్ ఆచార్య సినిమాతో పాటుగా తమిళంలో భారతీయుడు 2 షూటింగ్ చెయ్యాల్సి ఉండగా.. ఆచార్య సినిమా షూటింగ్ లో కాజల్ త్వరలోనే జాయిన్ అయినా.. భారతీయుడు సినిమా షూటింగ్ మాత్రం ఇంకా పెండింగ్ లో ఉంది. 

Tags:    

Similar News