అజయ్ భూపతికి చుక్కలు కనబడుతున్నాయ్ గా

RX 100 హిట్ తర్వాత హీరో, హీరోయిన్ లిద్దరూ తమతమ సినిమాల్తో బిజీ అయ్యారు కానీ, దర్శకుడు అజయ్ భూపతి కే ఇంకా రెండో సినిమా పట్టాలెక్కలేదు. [more]

Update: 2019-11-29 06:25 GMT

RX 100 హిట్ తర్వాత హీరో, హీరోయిన్ లిద్దరూ తమతమ సినిమాల్తో బిజీ అయ్యారు కానీ, దర్శకుడు అజయ్ భూపతి కే ఇంకా రెండో సినిమా పట్టాలెక్కలేదు. వరసబెట్టి హీరోల చుట్టూ తిరుగుతున్నప్పటికీ.. ఏ ఒక్క హీరో అవకాశం ఇవ్వడానికి రెడీగా లేరు. మాహా సముద్రం అంటూ ఓ కథ వేసుకుని అజయ్ భూపతి స్టార్ట్ అండ్ మీడియం అండ్ యంగ్ హీరోల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పని జరగడం లేదు. నితిన్, రవితేజ, నాగ చైతన్య చివరికి కార్తికేయ కూడా అజయ్ భూపతికి హ్యాండ్ ఇచ్చాడనే టాక్ నడుస్తుంది. రవితేజ అయితే మహాసముద్రం స్క్రిప్ట్ ఓకె చేసి చివరికి కాదన్నాడని … చీప్ స్టార్ట్ అంటూ పెద్ద మాటలు మట్లాడిన అజయ్ భూపతికి… నాగ చైతన్య కూడా ఊరించి మోసం చేసాడు. చైతు, అజయ్ ని కాదని మరో సినిమాకి కమిట్మెంట్ ఇచ్చాడట.

ఇక కార్తికేయ తోనే మహా సముద్రం తీసి టాలెంట్ ఏంటో అందరికి చూపించాలని అనుకుని కార్తికేయ ని లైన్ లో పెట్టడము.. ఆ సినిమా కోసం విశ్వక్ సేన్ ని విలన్ గా సెట్ చేసుకొవడం జరిగాయని టాక్. అయితే కార్తికేయ కి గుణ 369 లాంటి ప్లాప్ షాకివ్వడంతో… మహాసముద్రం స్క్రిప్ట్ పై నమ్మకం పోవడం, చాలామంది హీరోలు కాదన్న కథని చేస్తే… చివరికి తేడా కొడితే పరిస్థితి ఏమిటి అనుకున్నాడేమో… మహాసముద్రం పక్కనబెట్టి మరో కొత్త కథతో సినిమా చేద్దామని అజయ్ దగ్గర మెలిక పెట్టడంతో.. అజయ్ భూపతి ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయాడట. మరి హీరోలంతా అజయ్ భూపతికి కి హోల్సేల్ గా చుక్కలు చూపెడుతున్నారన్నమాట

Tags:    

Similar News