విడుదల వరకు అలానే ఉండాలా జక్కన్నా?

రాజమౌళితో చేస్తున్న RRR కోసం ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు సిక్స్ ప్యాక్ కాదు., అంతకు మించి బాడీ షేప్ లోకి మారారు. రామ్ చరణ్ [more]

Update: 2020-10-27 06:40 GMT

రాజమౌళితో చేస్తున్న RRR కోసం ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు సిక్స్ ప్యాక్ కాదు., అంతకు మించి బాడీ షేప్ లోకి మారారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం గా అదరగొట్టేస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి లుక్, ఎన్టీఆర్ కొమరం భీం లుక్ రెండు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసాయి. అయితే RRR కోసం అల్లూరి లుక్ ని, ఎన్టీఆర్ కొమరం భీం లుక్ ని ఇప్పటికి అలానే మైంటైన్ చేస్తున్నారు. లాక్ డౌన్ లో రామ్ చరణ్ అయితే హెయిర్ అండ్ గెడ్డం పెంచినా ఎన్టీఆర్ మాత్రం కొమరం భీం లుక్ నే ఫాలో అయ్యాడు. ఇక ప్రస్తుతం RRR షూటింగ్ మొదలవడం హీరోలు సెట్స్ మీద కెళ్ళడం జరిగింది. ఇక చరణ్ అల్లూరి లుక్ ని, ఎన్టీఆర్ కొమరం భీం లుక్ ని వీడియోస్ తో బయటపెట్టి ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ ని కూల్ చేసాడు జక్కన్న.

ఇక జక్కన్న RRR సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది. ఎప్పుడు సినిమాని విడుదల చేస్తామని క్లారిటీ ఇవ్వడం లేదు. ఏమంటే కరోనా అంటున్నాడు. దానితో ఎన్టీఆర్ – చరణ్ ఫాన్స్ ఇద్దరూ రాజమౌళి RRR విడుదల ఎప్పుడంటాడా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు రాజమౌళి ఇద్దరి హీరోలకు ఓ కండిషన్ పెట్టాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది. అది RRR షూటింగ్ పూర్తయ్యి.. హీరోలు ఫ్రీ అయినా మీరు గెటప్స్ చేంజ్ చెయ్యడానికి వీలు లేదు… నా సినిమా విడుదల వరకు అల్లూరి, భీం గెటప్స్ లోనే మీరుండాలి అంటూ చరణ్ – ఎన్టీఆర్ లకి అల్టిమేటం జారీ చేసాడట.

ఎందుకంటే దేశ విదేశాల్లో RRR సినిమా ప్రీ రిలీజ్ పబ్లిసిటీ ఓ రేంజ్ లో ఉండాలని.. ఆ పబ్లిసిటీకి హీరోలిద్దరూఒ కొమరం భీం, అల్లూరి గెటప్స్ లోనే ఉండాలని.. అప్పుడే సినిమాకి క్రేజ్ వస్తుందని.. సో మీరు షూటింగ్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్, పబ్లసిటీ అయ్యాకే గెటప్స్ చేంజ్ చెయ్యాలని చెప్పాడట. అంటే హీరోలు RRR పూర్తయినా సినిమా విడుదలయ్యేవరకు తమ తదుపరి సినిమాల కోసం గెటప్స్ చేంజ్ చెయ్యడానికి లేదన్నమాట.

Tags:    

Similar News