బెడ్ రూమ్ సీన్స్ కు ‘నో’!

మెగా కాంపాండ్ నుండి పది మంది పైనే హీరోస్ వచ్చారు. అందరు తమతమ లక్ ను పరీక్షించుకుంటున్న టైములో మెగా డాటర్ నిహారిక వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. [more]

Update: 2020-05-05 08:19 GMT

మెగా కాంపాండ్ నుండి పది మంది పైనే హీరోస్ వచ్చారు. అందరు తమతమ లక్ ను పరీక్షించుకుంటున్న టైములో మెగా డాటర్ నిహారిక వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. చేయడానికి అరడజన్ పైనే సినిమాలు చేసింది కానీ అన్ని ఫ్లాపులే. హీరోయిన్ గా తొలి విజయం కోసం చకోర పక్షిలా చూస్తుంది నిహారిక కు తమిళం నుండి ఓ సినిమా ఆఫర్ వచ్చింది. అది మంచి ఆఫరే అయినా నిహారిక దాన్ని నో చెప్పిందట. వివరాలలోకి వెళ్తే…

లేటెస్ట్ గా ఈ అమ్మడుకి తమిళ ఇండస్ట్రీ నుండి ఓ ఆఫర్ వచ్చింది అయితే అందులో హాట్ సన్నివేశాలతో పాటు బెడ్రూమ్ సీన్స్ కూడా ఉన్నాయని.. కథకు అవి అవసరమే అయినా కూడా తన బ్యాగ్రౌండ్ దృష్ట్యా దానికి నో చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. అటువంటి  సన్నివేశాలు చేయడం కంటే ఆ సినిమా ఛాన్స్ వదులుకోడం బెటర్ అంటుంది నిహారిక. కావాలంటే సినిమా ఛాన్స్ లు మళ్లీ  వస్తాయికానీ అటువంటి సీన్స్ చేస్తే మెగా ఫామిలీ ఇమేజ్ తీసేసినట్టు అవుతుందని అందుకే అటువంటి సినిమాలకు నో చెబుతున్న అంటుంది. ప్రస్తుతం ఈమె స్వాతి అనే కొత్త డైరెక్టర్ సినిమాలో నటిస్తుంది. ఇందులో రొమాంటిక్ సీన్స్ ఉన్నప్పటికీ అవి హద్దు దాటనంటుంది. ఒకవేళ అటువంటి సీన్స్ చేయాలంటే సినిమాను వదిలేసుకుంటానని దర్శక నిర్మాతలకు మొహమాటం లేకుండా నిహారిక చెబుతుందని ప్రచారం జరుగుతుంది.

Tags:    

Similar News