జబర్దస్త్ కి నో ఎంట్రీ… అందుకే కొత్త షోలు?

నాగబాబు అదిరింది షో ని పైకిలేపి జబర్దస్త్ షో కి పోటీనిచ్చి.. అదిరింది ని క్లిక్ చేద్దామని బొక్క బోర్లా పడ్డాడు. జబర్దస్త్ నుండి వెళ్ళిపోదామని అనుకున్నవాడు.. [more]

Update: 2020-07-28 11:17 GMT

నాగబాబు అదిరింది షో ని పైకిలేపి జబర్దస్త్ షో కి పోటీనిచ్చి.. అదిరింది ని క్లిక్ చేద్దామని బొక్క బోర్లా పడ్డాడు. జబర్దస్త్ నుండి వెళ్ళిపోదామని అనుకున్నవాడు.. కామ్ గా వెళ్లకుండా జబర్దస్త్ ని నానా మాటలన్నాడు. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. నాగబాబు జేడ్జ్ గా ఉన్నప్పుడు జబర్దస్త్ టిఆర్పి రేటింగ్స్ ఓ రేంజ్ లో ఉండేవి. కానీ నాగబాబు అసంతృప్తితో జబర్దస్త్ ని పక్కనబెట్టి దాన్ని తూలనాడుతూ.. అదిరింది షోకి వెళ్ళాడు. అక్కడ కూడా చమ్మక్ చంద్ర, వేణు, ధనరాజ్ లాంటి వాళ్ళు కావాల్సిన కామెడీ చేసినా షోకి ఏదో తక్కువై జబర్దస్త్ ని క్రాస్ చెయ్యలేక చేతులెత్తేస్తుంది. కరోనా లాక్ డౌన్ తర్వాత అదిరింది షో రేటింగ్స్ కూడా బావున్నాయంటున్నారు. కానీ జబర్దస్త్ అంత కాదు. అందుకే నాగబాబు మల్లి జబర్దస్త్ కే వెల్దామనుకున్నాడట.

కానీ మల్లెమాల వారు నాగబాబు కి నో ఎంట్రీ బోర్డు పెట్టారనే టాక్ వినబడుతుంది. నాగబాబు కెరీర్ కుదేలైనప్పుడు జబర్దస్త్ తో మల్లెమాల టీం నాగబాబుకు లక్షల్లో పారితోషకాలిచ్చి మరీ.. ఆయన కెరీర్ ని నిలబెట్టింది. కానీ నాగబాబుకు ఏం తక్కువైందో జబర్దస్త్ ని నానా మాటలన్నాడు. అందుకే ఎట్టి పరిస్తితుల్లోనూ నాగబాబుకు మల్లి ఎంట్రీ ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు మల్లెమాల టివి తీసుకుందట. మరి అదిరిందిలో ఉండలేక జబర్దస్త్ కి వెళ్ళలేకే నాగబాబు ఓన్ యూట్యూబ్ లో రెండు కామెడీ షోస్ ప్లాన్ చేసి.. కమెడియన్స్ కి ఆహ్వానాలు పంపుతున్నాడట. మన ఛానల్ మన ఇష్టం లో విజిల్ అండ్ ఆఖుషీ ఖుషీగా అంటూ రెండు షోస్ ని ప్లాన్ చేసాడు. మరి అదిరింది అదరలేక.. జబర్దస్త్ లో నో ఎంట్రీ తో విజిల్, ఖుషి ఖుషీగా ఏమాత్రం క్లిక్ అవుతుందో చూడాలి. 

Tags:    

Similar News