మేం డివోర్స్ తీసుకోలేదంటున్న హీరోయిన్?

పవన్ కళ్యాణ్ తో ఖుషి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన భూమిక ఎన్టీఆర్ తోనూ నటించింది. కానీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. కెరీర్ లో సినిమాలు [more]

Update: 2020-10-23 04:30 GMT

పవన్ కళ్యాణ్ తో ఖుషి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన భూమిక ఎన్టీఆర్ తోనూ నటించింది. కానీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. కెరీర్ లో సినిమాలు చేస్తున్నప్పుడే యోగా గురువు భరత్ ఠాగూర్ ని ప్రేమించి పెళ్లాడింది. పెళ్లి తర్వాత నిర్మాతగానూ భూమిక చేతులు కాల్చుకుంది. అయితే గత కొన్నాళ్లుగా భూమిక సినిమా ప్రయత్నాలు మాములుగా లేవు. అది కూడా హాట్ హాట్ యాంగిల్స్ లో హీరోయిన్ పాత్రల కోసం ట్రై చేసున్నట్టుగా ఫొటోషూట్స్ చేయించుకోవడం.. వర్కౌట్స్ చెయ్యడం ఇలా భూమిక సినిమా అవకాశాల కోసం పరితపిస్తుంది. అయితే భూమికకు ఆఫర్స్ వస్తున్నాయ్ కానీ అవి వదిన, అక్క పాత్రలు మాత్రమే.

ఇక కెరీర్ విషయం అలా ఉంటె.. భూమిక ఈ మధ్యన భర్త భరత్ ఠాగూర్ తో కలిసి ఉండడం లేదని, ఆమె ఎక్కడ చూసినా సింగిల్ గానే కనిపిస్తుంది అని, భరత్ ఠాగూర్ తో భూమిక కి విభేదాల కారణమగానే కెరీర్ లో బిజీ కావాలి అనుకుంటుంది అని.. అసలు వాళ్ళిద్దరికీ డైవర్స్ కూడా అయ్యాయనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మరి ఈ న్యూస్ లు భూమిక చెవిన పడకుండా ఉంటాయా.. అందుకే భూమిక వెంటనే స్పందించకుండా.. తన భర్త తో తాను విడిపోలేదు, అసలు డివోర్స్ తీసుకోలేదని చెప్పకనే చెప్పేసింది. అది కూడా తనతో కలిసి ఉన్న భర్త భరత్ ఠాగూర్ ఫోటో తో పాటుగా ఆయనకు వెడ్డింగ్ యానివెర్సరీ విషెస్ చెప్పింది. కొన్ని వేల అడుగులు కూడా ప్రేమ అనే ఒక్క అడుగుతోనే ప్రారంభం అయినట్టు.. తన పెళ్లికి ప్రేమ అనే అండదండలతో ఇన్ని రోజులు కలిసి నడిచామంటూ… భూమిక ట్వీట్ చెయ్యడంతో.. భర్త తో భూమిక చక్కగా కలిసే ఉంటుంది, భూమిక విడాకులపై వచ్చిన వార్తలన్నీ గాసిప్స్ అని తేలిపోయాయి.

Tags:    

Similar News