పవన్ అలా చేస్తే ఇంకేముంది!!

పవన్ కళ్యాణ్ సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్న టైములో అంటే టాలీవుడ్ నెంబర్ వన్ అని అనుకున్నప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టి .. సినిమాలను పక్కనపెట్టేశారు. అయితే సినిమాలో [more]

Update: 2020-06-28 02:48 GMT

పవన్ కళ్యాణ్ సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్న టైములో అంటే టాలీవుడ్ నెంబర్ వన్ అని అనుకున్నప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టి .. సినిమాలను పక్కనపెట్టేశారు. అయితే సినిమాలో క్రేజ్ ఎలా ఉన్నా.. రాజకీయాల్లో పవన్ ఇప్పటికి రాణించలేకపోతున్నాడు. రాజకీయాలంటే పవన్ కళ్యాణ్ కి ఒక హుందాతనం ఉండాలి. అలాంటి టైం లో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చి ఏదైనాసమాజానికి మంచి జరిగే కథలతో సినిమాలు చెయ్యాలి కానీ కమర్షియల్ సినిమాలు చేస్తూ మూడు డ్యూయెట్స్.. ఒక ఐటెం సాంగ్.. అలాగే నాలుగు ఫైట్స్ అంటూ సినిమాలు ఉంటె బావుండదు. అందుకే పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన వకీల్ సాబ్ అనే సామజిక బ్యాగ్డ్రాప్ లోనే కథను తీసుకుని మంచి పని చేసాడు.

ఇక క్రిష్ నుండి పవన్ చెయ్యబోయే సినిమా కూడా ఓ జానపద నేపథ్యం ఉన్నా సినిమానే కావడం విశేషం. అయితే హరీష్ శంకర్ దగ్గరికొచ్చేసరికి హరీష్ శంకర్ పక్కా కమర్షియల్ చిత్రాలకి ఇంపార్టెన్స్ ఇస్తాడు. మరి పవన్ తో కమర్షియల్ ఎలివేట్స్ ఉన్న కథ తీసుకుని సినిమా చేస్తాడనే టాక్ ఉంది. అయితే తాజాగా సినిమా సర్కిల్స్ లో వినబడుతున్న న్యూస్ చూస్తే పవన్ ఫాన్స్ బాగా హార్ట్ అవడం ఖాయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇకమీదట డాన్స్ చెయ్యడం కానీ.. మరీ రొమాంటిక్ సన్నివేశాల్లో కానీ నటించడనే టాక్ వినబడుతుంది. రాజకీయ సేవ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఇలాంటి రొమాన్స్ కానీ.. ఎడాపెడా డాన్స్ చెయ్యడం కరెక్ట్ కాదని పవన్ భావిస్తున్నాడట. అయితే పవన్ఇదివరకెప్పుడు డాన్స్ తో ఎక్కడా అదరగొట్టలేదు.. కానీ పాటలకు అనుగుణంగా చిన్న స్టెప్స్ తో ఆకట్టుకునేవాడు. మరి పవన్ డాన్స్ చెయ్యను, రొమాన్స్ చెయ్యను అంటే పవన్ ఫాన్స్ బాగా హార్ట్ అవడం ఖాయమే.

Tags:    

Similar News