అదంతా అబద్దం అంటున్న ప్రేమ పక్షులు!!

కోలీవుడ్ లో కరోనా కారణంగా షూటింగ్స్ అన్ని ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. అయితే కరోనా లాక్ డౌన్ టైం లోనే కోలీవడ్ ప్రేమ జంట నయనతార – విగ్నేష్ [more]

Update: 2020-06-22 05:45 GMT

కోలీవుడ్ లో కరోనా కారణంగా షూటింగ్స్ అన్ని ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. అయితే కరోనా లాక్ డౌన్ టైం లోనే కోలీవడ్ ప్రేమ జంట నయనతార – విగ్నేష్ శివన్ లు గుట్టుచప్పుడు కాకుండా గుళ్లో పెళ్లి చేసుకోబోతున్నారని.. విగ్నేష్ శివన్ ఇంట్లో పెళ్లి ఒత్తిడి ఎక్కువగా ఉన్న కారణంగా నయనతార కూడా పెళ్లి ప్రపోజల్ కి ఒప్పుకుంది అనే టాక్ నడుస్తుంది. రేపో మాపో నయనతార – విగ్నేష్ శివన్ ల గుళ్లో పెళ్లి అనే వార్త సోషల్ మీడియాని కమ్మేసింది. అయితే తాజాగా ఆ పెళ్లి వార్త పక్కనపడేసి.. నయనతార – విగ్నేష్ లు కరోనా బారిన పడ్డారనే న్యూస్ కోలీవడ్ మీడియాని షేక్ చేసింది.

కరోనా లాక్ డౌన్ లో నయనతారకి, విగ్నేష్ శివన్ లకి కరోనా పోజిటి వచ్చినట్లుగా మీడియాలో న్యూస్ నడుస్తుంది. అయితే ఆ వార్త చూసిన నయనతార అండ్ విగ్నేష్ లు తమ పిఆర్ టీం ద్వారా తమకి కరోనా లేదని.. మాకు కరోనా ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదని అదంతా అబద్దం అని.. తాము సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నామని చెబుతున్నారు. నయనతారకి కరోనా పాజిటివ్ అనగానే ఆమె అభిమానులలో ఫుల్ టెంక్షన్. కానీ ఇప్పుడు కారోనా లేదని తెలియడంతో నయన్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.. 

Tags:    

Similar News