సీతకు ఇక తిరుగులేదా..?

బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ జంటగా మరోసారి నటించిన చిత్రం సీత. తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మే 24 న రిలీజ్ అవుతుంది. ఎన్నో [more]

Update: 2019-05-18 08:47 GMT

బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ జంటగా మరోసారి నటించిన చిత్రం సీత. తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మే 24 న రిలీజ్ అవుతుంది. ఎన్నో వాయిదాల తరువాత ఈ డేట్ న రిలీజ్ అవుతున్న సీతకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ట్రైలర్ బట్టి చూస్తుంటే ఈ సినిమాలో ఏదో ఉందన్న అభిప్రాయం కలిగించింది. 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు పోటీ ఏమీ లేదు. మహర్షి ప్రస్తుతం స్టడీగానే ఉన్నప్పటికీ మరీ ఆశించిన అద్భుతాలు అయితే చేయడం లేదు.

పోటీ లేకపోవడంతో…

ఇక నిన్న రిలీజ్ అయిన శిరీష్ ఏబీసీడీకి సైతం టాక్ కొంచెం అటు ఇటుగా రావడంతో కలెక్షన్లు డల్ గా ఉన్నాయి. దీంతో సీతకి ప్లస్ అవ్వనుంది. ఒకవేళ సీత టాక్ బాగుందని వస్తే త్వరగానే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశముంది. నేనే రాజు నేనే మంత్రి తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని చేసిన మూవీ కాబట్టి తేజ ఫ్యాన్స్ దీని మీద నమ్మకంగానే ఉన్నారు. అయితే దీనికి ఓ హాలీవుడ్ మూవీ పోటీ ఉంది. అదే రోజు వెంకీ – వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పిన హాలీవుడ్ మూవీ అల్లాఉద్దీన్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేస్తే తప్ప సీతకు పోటీ కాదు.

Tags:    

Similar News