అది కలలో కూడా జరగదంటున్న ఛార్మి!!

గత కొన్ని రోజులుగా అంటే ముంబై ప్రాంతంలో కరోనా విజృంభణ కారణముగా పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ ల ఫైటర్ షూటింగ్ విషయంలో పూరి అండ్ [more]

Update: 2020-06-22 04:04 GMT

గత కొన్ని రోజులుగా అంటే ముంబై ప్రాంతంలో కరోనా విజృంభణ కారణముగా పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ ల ఫైటర్ షూటింగ్ విషయంలో పూరి అండ్ ఛార్మి లు తలలు పట్టుకున్నారని.. ఫైటర్ స్క్రిప్ట్ మొత్తం ముంబై పరిసర ప్రాంతాల్లో రాసుకున్న స్క్రిప్ట్ కారణంగా కరోనా వలన ముంబై వెళ్లి షూట్ చేసే పరిస్థితి లేకపోవడంతో.. హైదరాబాద్ లోనే ముంబై సెట్ వేస్తున్నారని, ఇక విజయ్ దేవరకొండ బాక్సర్ గా హాలీవుడ్ బాక్సెర్స్ తో తలపడాల్సి ఉండగా… ప్రస్తుతం కరోనా కారణంగా హాలీవుడ్ స్టెంట్ మాస్టర్స్ వచ్చే పరిస్థితి లేనందున విజయ్ ఫైటర్ స్క్రిప్ట్ లో మార్పులు చేసి లోకల్ ఫైటర్స్ తోనే ఈ ఫైట్ సీన్స్ చిత్రీకరిస్తారనే ప్రచారం జరుగుతుంది.

అయితే తాజాగా ఛార్మి మాత్రం ఫైటర్ సినిమాలో మార్పులు ఉండవని… స్క్రిప్ట్ లో ఎలాంటి మార్పులు చెయ్యడం లేదని.. ఫైటర్ స్క్రిప్ట్ బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్ అని… అందుకే ఇందులో ఎలాంటి మార్పులు చేయబోవడం లేదని చెబుతుంది. ఫైటర్ స్క్రిప్టుకు తిరుగులేదని… అందులో మార్పులు చేయాల్సిన అవసరం కానీ అగత్యం కానీ లేదని స్పష్టం చేసింది. అయితే ముంబై లో కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని చెప్పిన ఛార్మి.. ఫైటర్ ఒరిజినల్ టైటిల్ త్వరలోనే ప్రకటించబోతున్నట్లుగా చెప్పి అందరిని సస్పెన్సు లో పడేసింది.

Tags:    

Similar News