కథలో ఎలాంటి మార్పు లేదు

శర్వానంద్ తో ‘రన్ రాజా రన్’ సినిమా తీసి తన రెండో సినిమా కోసం డైరెక్టర్ సుజీత్ ఐదేళ్లు ఎదురు చూడాల్సి రావడం ఆశ్చర్యమే. కానీ ప్రభాస్ [more]

Update: 2019-08-08 07:24 GMT

శర్వానంద్ తో ‘రన్ రాజా రన్’ సినిమా తీసి తన రెండో సినిమా కోసం డైరెక్టర్ సుజీత్ ఐదేళ్లు ఎదురు చూడాల్సి రావడం ఆశ్చర్యమే. కానీ ప్రభాస్ లాంటి స్టార్ హీరో దొరకడంతో ఇంత లేట్ అవుతుందని ఆలోచించలేదని లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ లో సుజీత్ అన్నాడు.

లేట్ అయిందని….

సినిమా లేట్ అయిందని ఎప్పుడు తాను ఆలోచించలేదని…సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు మూడేళ్లు తానేమి ఖాళీగా లేనని ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రతి రోజు చేస్తూ వచ్చాము అని సుజీత్ అన్నాడు. పది సినిమాల్లో నేర్చుకోవలసినవి నేను ‘సాహో’ ఒక్కదానికే నేర్చుకున్నానని…ఈసినిమా కోసం వరల్డ్ వైడ్ టెక్నీషియన్లతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని సుజీత్ తెలిపాడు. నేను ప్రభాస్ కి ఈ కథ బాహుబలి రిలీజ్ కి ముందే చెప్ప కానీ ఈ లోపల బాహుబలి రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది. అలా పెద్ద విజయం సాధించిందని..ప్రభాస్ ఇమేజ్ మారిపోయిందని నేను స్క్రిప్ట్ లో ఏ మార్పులు చేయలేదు. కాకపోతే ప్రభాస్ మార్కెట్ పెరిగింది కాబ్బటి సినిమా ని లార్జ్ స్కేల్ లో తీశాం తప్ప కథను మార్చలేదని స్పష్టం చేశాడు. ఇందులో పెద్దపెద్ద టెక్నీషియన్లతో పని చేయడం తనను ఏమాత్రం ఒత్తిడికి గురి అవ్వలేదని తెలిపాడు.

Tags:    

Similar News