అల్లు అర్జున్ లుక్ ఏం మారలేదే!!

అల వైకుంఠపురములో లో మిడిల్ క్లాస్ కుర్రాడిగా అల్లు అర్జున్ చిన్నపాటి గెడ్డం, రఫ్ హెయిర్ స్టయిల్ తో చాల సదా సీదా లుక్ లో కనిపించాడు. [more]

Update: 2020-07-05 07:45 GMT

అల వైకుంఠపురములో లో మిడిల్ క్లాస్ కుర్రాడిగా అల్లు అర్జున్ చిన్నపాటి గెడ్డం, రఫ్ హెయిర్ స్టయిల్ తో చాల సదా సీదా లుక్ లో కనిపించాడు. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ తో పుష్ప అంటూ పాన్ ఇండియా కి వెళ్లబోతున్నాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ రఫ్ గా లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడు. పుష్ప ఫస్ట్ లుక్ లోనే అల్లు అర్జున్ గుబురు గెడ్డం, రఫ్ హెయిర్ స్టయిల్, లుక్ లోను చాల రఫ్ గౌ కనిపించాడు. జుట్టు కూడా గోల్డ్ కలర్ గా చాల రఫ్ లుక్ లో అల్లు అర్జున్ పుష్ప లో కనిపించనున్నాడు. అయితే లాక్ డౌన్ కారణంగా ఇంకా పట్టాలెక్కని పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ ఇప్పటికే లుక్ టెస్ట్ తో పాటుగా.. చిన్నపాటి పనులను కూడా పూర్తి చేసాడు.

అయితే లాక్ డౌన్ లో తన ఫ్యామిలీతోనే టైం గడుపుతున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం అంటే లాక్ డౌన్ మూడు నెలల పదిహేను రోజుల్లో ఏమన్నా లుక్ మార్చేడేమో అని మెగా ఫాన్స్ చూస్తున్నారు. కానీ అల్లు అర్జున్ పుష్ప కోసం ఎలా మేకోవర్ అయ్యేడో అలానే ఉన్నాడు.
తాజాగా అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహ తో కలిసి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ లో జాగింగ్ చేయడానికి వచ్చాడు. అక్కడ బన్నీ పుష్ప మేకోవర్ లోనే ఉన్నాడు. హెయిర్ పెంచి.. చిన్న పిలక వేసుకుని, రఫ్ గా ఉన్న గెడ్డంతోనే కనబడుతున్నాడు. అంటే అల్లు అర్జున్ లుక్ మార్చలేదు. పుష్ప లుక్ నే కంటిన్యూ చేస్తున్నాడు అంటే.. కరోనా ఉధృతి తగ్గాగ్నే పుష్ప సెట్స్ కెళ్లడానికి ఆనువుగానే ఉన్నాడు.

Tags:    

Similar News