బాయ్ ఫ్రెండ్ అయితే లేడు!!

అక్కినేని బ్రదర్స్ తనకి హిట్ ఇవ్వలేకపోయినా… హీరో రామ్ మాత్రం ఇస్మార్ట్ శంకర్ తో భారీ హిట్ ఇచ్చాడు నిధి అగర్వాల్ కి. సవ్యసాచి, మిస్టర్ మజ్ను [more]

Update: 2020-05-03 10:07 GMT

అక్కినేని బ్రదర్స్ తనకి హిట్ ఇవ్వలేకపోయినా… హీరో రామ్ మాత్రం ఇస్మార్ట్ శంకర్ తో భారీ హిట్ ఇచ్చాడు నిధి అగర్వాల్ కి. సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాల్లో నిధి అందాలు ఆరబోసినా పని జరగలేదు కానీ…. ఇస్మార్ట్ లో నిధి అందాలకు భలే గిరాకీ తగిలింది. నిధి అందాల మోతకు యంగ్ హీరోలు షేక్ అయ్యారు. అలా ఓ సినిమాలో నిధికి ఆఫర్ దొరికింది. అయితే ఇస్మార్ట్ తర్వాత నిధి అగర్వాల్ ఓ రేంజ్ లో బిజీ అవుతుంది ఆనుకుంటే.. అంతగా లేదు. అయితే తాజాగా లాక్ డౌన్ లో మీరంతా ఏం చేస్తున్నారు.. నేను మాత్రం ఇంట్లోనే ఉంటున్నా అని చెప్పిన నిధి అగర్వాల్ అభిమానులతో చిట్ చాట్ చేసింది. ప్రస్తుతం తాను తన బెంగుళూరు ఇంట్లోనే ఉంటున్నా అని చెప్పింది.

ఇక నిధి అగర్వాల్ ఫోన్ స్క్రీన్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి.. నెను ఏంజిల్స్ ని నమ్ముతా అని చెప్పింది. ఇక మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేదంటే ఎవరితోనైనా రిలేషన్ లో ఉన్నారా అని అడగగా.. నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు.. అలాగే నేను ఎలాంటి రిలేషన్ లో లేను అంటూ సమాధానం చెప్పింది. ఇక నిధి అగర్వాల్ తమిళనాట జయం రవితో భూమి చిత్రంలో నటించింది. ఆ సినిమా ఈ వారం అంటే మే 8 న విడుదల కావాల్సి ఉండగా…. కరోనా లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా వాయిదా పడింది.

Tags:    

Similar News