అందరూ బాలీవుడ్ అంటుంటే.. బన్నీ మాత్రం..!!

పాన్ ఇండియా స్టార్స్ మొత్తం బాలీవుడ్ భామలనే పడుతుంటే..  అల్లు అర్జున్ మాత్రం సౌత్ హీరోయిన్ తోనే సరిపెట్టుకుంటున్నారు. సౌత్ హీరోలెవరైనా పాన్ ఇండియా మూవీ మొదలు [more]

Update: 2020-07-22 06:34 GMT

పాన్ ఇండియా స్టార్స్ మొత్తం బాలీవుడ్ భామలనే పడుతుంటే..  అల్లు అర్జున్ మాత్రం సౌత్ హీరోయిన్ తోనే సరిపెట్టుకుంటున్నారు. సౌత్ హీరోలెవరైనా పాన్ ఇండియా మూవీ మొదలు పెడితే.. ఖచ్చితంగా ఆ సినిమాకి బాలీవడో భామ రావాల్సిందే. బాహుబలి టైం రాజమౌళి అంత ఎక్కువగా ఆలోచించలేదు కానీ.. ప్రభాస్ సాహో టైం లో బాలీవుడ్ భామ అయితే క్రేజ్ వస్తుంది ఆని శ్రద్ద కపూర్ ని తీసుకున్నాడు. సాహో సినిమాకి శ్రద్ద కపూర్ పెద్ద యూస్ అయ్యింది లేదు. అందుకే రాధేశ్యాం వచ్చేసరికి ప్రభాస్ హిందీలోనూ పరిచయమున్న పూజ హెగ్డే తో సరిపెట్టుకున్నాడు. ఇంకా ఆ సినిమా విడుదలకావాల్సి ఉంది. ఇక రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి తెరకెక్కించబోయే RRR లో రామ్ చరణ్ కి జోడిగా రాజమౌళి బాలీవుడ్ భామ అలియా భట్ ని తీసుకున్నాడు. ఎన్టీఆర్ కి  ఏకంగా హాలీవుడ్ హీరోయిన్ ని దింపుతున్నాడు.

మరి తాజాగా ప్రభాస్ – నాగ్ అశ్విన్ పాన్ ఇండియా ఫిలిం కోసం ఏకంగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనెనే తీసుకొస్తున్నారు. కానీ అల్లు అర్జున్ ఆలోచనలు పాన్ ఇండియా లెవల్లో ఉన్న హీరోయిన్ విషయంలో సౌత్ కె పరిమితం చేసాడు. సుకుమార్ తో పుష్ప పాన్ ఇండియా మూవీ చేస్తున్న అల్లు అర్జున్ బాలీవుడ్ భామని తీసుకుంటాడనుకుంటే.. కేవలం సౌత్ హీరోయిన్ రష్మికతోనే ఆగిపోయాడు. అందులోను రశ్మికకి పెరఫార్మెన్స్ తక్కువ.. ఓవేరేక్షన్ ఎక్కువ. అలాంటి హీరోయిన్ తో అల్లు అర్జున్ ఏ ధైర్యంతో పాన్ ఇండియాకి వెళుతున్నాడు. ఏ కియారనో, లేదంటే మారేదన్న బాలీవుడ్ భమానో తీసుకోవాలి  కానీ.. అల్లు అర్జున్ ఇలా హీరోయిన్ విషయంలో కంప్రమైజే ఎలా అయ్యాడో అర్ధం కాక అల్లు అర్జున్ ఫాన్స్ తలలు పట్టుకుంటున్నారు. ఇక ఆఖరుకి విజయ్ దేవరకొండ కూడా బాలీవుడ్ భామ అనన్య పాండే తో సినిమా చేస్తున్నాడు. అలాంటిది అల్లు అర్జున్ ఎందుకిలా అంటూ ఫాన్స్ కొట్టేసుకుంటున్నారు. 

Tags:    

Similar News