ఒకే ఒక్క బ్లాక్ బస్టరా… రాజా ?

ఈ ఏడాది మొదలై అప్పుడే అర్ధ సంవత్సరం పూర్తి చేసుకుంది. దాదాపుగా ఐదు నెలల 10 రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఇప్పటివరకు ఒక్క బ్లాక్ బస్టర్ [more]

Update: 2019-06-10 07:28 GMT

ఈ ఏడాది మొదలై అప్పుడే అర్ధ సంవత్సరం పూర్తి చేసుకుంది. దాదాపుగా ఐదు నెలల 10 రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఇప్పటివరకు ఒక్క బ్లాక్ బస్టర్ సినిమా కూడా ప్రేక్షకులు చూడలేదు. ఏదో అనుకోకుండా ఎఫ్ 2 కామెడీ ఎంటెర్టైనెర్ గా బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చోటు సంపాదించింది. అది కూడా ఆ సినిమాకి గట్టి పోటీ ఇచ్చే సినిమా ఏది లేదు గనక. ఎఫ్ 2 ఫస్ట్ హాఫ్ బావుంది. సెకండ్ హాఫ్ పరమ బోర్. అయినా ప్రేక్షకులు ఆ సినిమాని బ్లాక్ బస్టర్ చేశారు. ఇక తర్వాత వచ్చిన 118 సినిమా ఓ మాదిరిగా ఆడింది. అలాగే మజిలీ సూపర్ హిట్ అయినా… అమ్మిన దానికి వచ్చిన దానికి సరిపోయింది. ఇక జెర్సీ కూడా క్లాసిక్ హిట్. కానీ కలెక్షన్స్ నిల్.

ఇక ఎన్నో భారీ అంచనాలతో విడుదలైన మహర్షి మీద ప్రేక్షకులు భారీ నమ్మకం పెట్టుకుంటే.. అది యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. ఒకే ఒక్క భారీ సినిమా మహర్షి కూడా తుస్ మనిపించింది. ఇక ఎన్జీకే, సీత, హిప్పీ వరస ప్లాప్స్. మరి టాలీవుడ్ అర్ధఏడాది పూర్తి చేసుకుని ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ తో టాలీవుడ్ బాక్సాఫీసు ఉసూరుమంటుంది. మరి ఈ ఏడాది రెండే రెండు బిగ్ ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి ప్రేక్షకుల ఆశలన్నీ ఆ పెద్ద ప్రాజెక్టులు సాహో, సై రా సినిమాల మీద ఉంది. మరా సినిమాలు ఏం చేస్తాయో తెలియదు కానీ.. మన్మధుడు 2 తో పాటుగా విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ ఇలా కొన్ని సినిమాల మీద ప్రేక్షకులకు మంచి అంచనాలున్నాయి. మరి మిగిలిన అర్ధ సంవత్సరం టాలీవుడ్ పరిస్థితి ఎలా వుండబోతుందో చూద్దాం.

Tags:    

Similar News