నివేత థామస్ కి ఎంత బాధొచ్చింది

ఈమధ్యన అభిమానులతో స్టార్స్ అంతా సోషల్ మీడియాతో కనెక్ట్ అవుతున్నారు. లైవ్ వీడియోస్ తో లైవ్ చాట్ తో అభిమానులతో మాట్లాడుతున్నారు. ఇలా నివేత థామస్ కూడా [more]

Update: 2019-11-10 12:42 GMT

ఈమధ్యన అభిమానులతో స్టార్స్ అంతా సోషల్ మీడియాతో కనెక్ట్ అవుతున్నారు. లైవ్ వీడియోస్ తో లైవ్ చాట్ తో అభిమానులతో మాట్లాడుతున్నారు. ఇలా నివేత థామస్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ సెషన్‌లో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యింది. అయితే నివేత తో మాట్లాడిన చాలామంది నెటిజెన్స్ ఆమె నటనను పొగిడితే కొంతమంది మాత్రం నివేత పర్సనల్ లైఫ్ లోకి వెళ్లి ఆమెని వ్యక్తిగతంగా అసహ్యమైన పదజాలంతో దూషించడంతో బాధపడుతూ వారికీ కాస్త గట్టిగానె వార్నింగ్ ఇచ్చింది. నాతో మాట్లాడటానికి టైమ్ కేటాయించినందుకు థ్యాంక్స్. చాలామంది ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను. కానీ కొంతమంది నన్ను అసహ్యమైన ప్రశ్నలు కూడా అడిగారు అంటూ నివేత తెగ ఫీల్ అవుతుంది.

ఒకరు మీరు నటి కాకుండా ఉంటే.. ఏమయ్యేవారు అనగా నివేత మాత్రం తాను ఆర్కిటెక్ట్ అయ్యేదానిని అని జవాబిచ్చింది. మరొకరుమీకు బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారా.. ఇంతకీ మీరు వర్జినేనా.. అంటూ అసహ్యంగా అడగడం దానికి నివేత ఇలాంటి ప్రశ్నలను నేను పట్టించుకోను. ఇలాంటి ప్రశ్నలు అడిగేవారు తాను కూడా మనిషేనని గుర్తుంచుకోవాలి.. అంటూ కాస్త ఫైర్ అయ్యింది. మరి కొంతమంది తమ పరిధి దాటి నటులతో ఇలాంటి వల్గర్ మాటలు మాట్లాడడం అనేది నిజంగా వారి పైత్యానికి పరాకాష్టే

Tags:    

Similar News