నివేత పెతురాజ్ కి పెద్ద హీరోస్ తో ఛాన్స్

నివేత పెతురాజ్..ఈ పేరు కొన్ని సినిమాలనుండి తరచుగా వింటున్నాం. ఈమె తెలుగులో శ్రీ విష్ణు ‘మెంటల్ మదిలో’ అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. తమిళంలో ఒకటిరెండు సినిమాలు [more]

Update: 2019-07-06 05:35 GMT

నివేత పెతురాజ్..ఈ పేరు కొన్ని సినిమాలనుండి తరచుగా వింటున్నాం. ఈమె తెలుగులో శ్రీ విష్ణు ‘మెంటల్ మదిలో’ అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. తమిళంలో ఒకటిరెండు సినిమాలు చేసింది. రీసెంట్ గా ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’ వంటి విజయవంతమైన సినిమాల్లో నటించింది. కాకపోతే రెండో హీరోయిన్ గా నటించింది. అయినా కానీ ఈమెకు వరసగా ఆఫర్స్ వెతుకుంటూ వస్తున్నాయి. అది కూడా పెద్ద డైరెక్టర్స్ నుండి పెద్ద సినిమాల నుండి.

వివరాల్లో కి వెళ్తే ఆమెను ఇప్పటికే త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమాలో ఒక హీరోయిన్ గా తీసుకున్నారనే వార్త బయటికి వచ్చింది. అలానే అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ‘ఐకాన్’ లో సోలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఈ రెండు చిత్రాలే కాకుండా లేటెస్ట్ గా మరో సినిమాలో కూడా ఓకే అయింది. కిషోర్ తిరుమల తన తదుపరి చిత్రం రామ్ తో చేసే సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. అలా వరస అవకాశాలతో బిజీగా మారనుంది ఈ చిన్న హీరోయిన్

Tags:    

Similar News