బన్నీతో డాన్స్ అంటే భయమంటున్న మరో హీరోయిన్?

అల్లు అర్జున్ తో కలిసి స్టెప్స్ వేయాలంటే.. కావాలని కాళ్ళు విరగ్గొట్టుకోవడమే అంటూ.. ఈమధ్యన ఓ యంగ్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. [more]

Update: 2019-12-10 06:22 GMT

అల్లు అర్జున్ తో కలిసి స్టెప్స్ వేయాలంటే.. కావాలని కాళ్ళు విరగ్గొట్టుకోవడమే అంటూ.. ఈమధ్యన ఓ యంగ్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అవికా గోర్ ని అల్లు అర్జున్ తో డాన్స్ చేయ్యాలనుకుంటున్నారా అని అడగ్గానే…. ఎవరైనా ఆయనతో డాన్స్ చేసి కాళ్ళు విరగ్గొట్టుకోవాలనుకుంటారా అంటూ ఫన్నికామెంట్స్ చేసింది. ఇపుడు తాజాగా మరో హీరోయిన్ కూడా అల్లు అర్జున్ తో డాన్స్ అంత ఈజీ కాదంటుంది. పూజ హెగ్డే కి డీజే తో అల్లు అర్జున్ డాన్స్ పరిచయం ఉంది కాబట్టి.. అల వైకుంఠపురములో పూజ హెగ్డే కి అల్లు అర్జున్ డాన్స్ పెద్దగా ప్రాబ్లెమ్ అనిపించలేదు.

కానీ రెండో హీరోయిన్ నివేత పేతురేజ్ మాత్రం అమ్మో బన్నీతో డాన్సా అంటుంది. మరి ఇప్పటివరకు ఏ స్టార్ట్ హీరో డాన్స్ పరిచయం లేని నివేత పేతురేజ్ కి అల్లు అర్జున్ తో డాన్స్ చెయ్యాలి అంటే తాతలు దిగిరావడం ఖాయంఅంటుంది. అంత గొప్ప డాన్సర్ ని ఇంతవరకు చూడలేదు అంటూ బన్నీ డాన్స్ లను తెగ పొగిడేస్తోంది ఈ చిన్నది. రాములో రాముల పాట ఎంత క్లిక్ అయ్యిందో.. ఆ సాంగ్ లోని స్టెప్స్ వెయ్యడానికి అల్లు అర్జున్ పక్కన చాలా ఇబ్బంది పడిందట. అల్లు అర్జున్ చూపించే డాన్స్ మూమెంట్స్ కి నివేత విస్తుపోయింది. అయితే ఇంకోసారి గనక అల్లు అర్జున్ తో సినిమా ఛాన్స్ వస్తే… ఈసారి డాన్స్ ప్రాక్టీసు చేసి మరీ అల్లు అర్జున్ సినిమా చెయ్యడానికి ఒప్పుకుంట అని చెబుతుంది నివేత పేతురేజ్.

Tags:    

Similar News